లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ.. రెండో జాబితాలో 12 మంది అభ్యర్థులను ప్రకటించారు. బీఎస్పీ అధినేత మాయావతి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా బుధవారం రెండో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 11 జనరల్ స్థానాలు కాగా, ఒకటి ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం ఉంది. కాగా, ఏడు దశల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలో 58 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10న పోలింగ్ జరగనుంది. అయితే బీఎస్పీ మొదటి దశ పోలింగ్‌కు సంబంధించి మరింత మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి