కురవి: బీఎస్పీతోనే బడుగు బలహీనవర్గాల ప్రజలకు రాజ్యాధికారం దక్కుతుందని ఈ పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలో బీఎస్పీకి ఓటు వేయడం ద్వారా అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని ప్రవీణ్‌కుమార్ అన్నారు.
ఇవి కూడా చదవండి