Rape case: బీఎస్‌పీ ఎంపీని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

ABN , First Publish Date - 2022-08-06T23:04:24+05:30 IST

సమాజ్ పార్టీ ఎంపీ అతుల్ కుమార్ సింగ్..

Rape case: బీఎస్‌పీ ఎంపీని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

వారణాసి: అత్యాచారం, మోసం, బెదరింపుల కేసులో బహుజన్ సమాజ్ పార్టీ (Bahujan Samaj Party) ఎంపీ అతుల్ కుమార్ సింగ్ (Atul Kumar Sing)ను నిర్దోషిగా స్థానిక కోర్టు ప్రకటించింది. గత ఏడాది ఆగస్టులో 24 ఏళ్ల మహిళ తన స్నేహితుడితో కలిసి బీజేపీ ఎంపీపై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో సాక్షి (బాధితుడు స్నేహితుడు) గత ఏడాది సుప్రీంకోర్టు వెలుపల ఆత్మాహుతి చేసుకోవడంతో కాలిన గాయాలతో కన్నుమూశాడు. ఘోసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతుల్ రాయ్ ఈ కేసులో 2019 జూన్‌ నుంచి జైలులో ఉన్నారు. కాగా, అతుల్ రాయ్‌కు అనుకూలంగా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సియారాం చౌరాసియా తీర్పు వెలువరించినట్టు ఆయన తరఫు న్యాయవాది అనూజ్ యాదవ్ తెలిపారు. అతుల్ రాయ్‌పై ఇతర కేసులు పెండింగ్‌లో పెండింగ్‌లో ఉన్నందున ఆయన వెంటనే జైలు నుంచి విడుదల కాలేదు.


బాధితురాలి తరఫున ఎలాంటి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించలేదని, దీంతో నిందితుడిపై కేసు నిరూపణ కాలేదని జస్టిస్ చౌరాసియా తన తీర్పులో పేర్కొన్నారు. కాగా, సంఘటన వివరాల ప్రకారం, 2019 మే 1న అతుల్ రాయ్, తదితరులపై అత్యాచారం కేసు నమోదైంది. వారణాసిలోని ఫ్లాట్‌కు తనను అతుల్ రాయ్ తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని, వీడియోలు, ఫోటోలు తీసి, ఆన్‌లైన్‌లో పెడతానంటూ బెదరించాడని పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో 2019 జూన్ 22న కోర్టుకు రాయ్ లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన ప్రయాగరాజ్‌లోని నైని జైలులో ఉంటున్నారు.

Updated Date - 2022-08-06T23:04:24+05:30 IST