నెట్‌వర్క్ డిస్‌ప్లే పేరు మార్చేసిన బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా

ABN , First Publish Date - 2020-04-03T00:24:27+05:30 IST

దేశాన్ని కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో ఈ వైరస్‌పై మరింత అవగాహన పెంచేందుకు టెలికం సంస్థలు

నెట్‌వర్క్ డిస్‌ప్లే పేరు మార్చేసిన బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా

న్యూఢిల్లీ: దేశాన్ని కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో ఈ వైరస్‌పై మరింత అవగాహన పెంచేందుకు టెలికం సంస్థలు ఇప్పటికే కాలర్ ట్యూన్‌ను మార్చేశాయి. తాజాగా, యూజర్లలో వైరస్‌పై మరింత అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియాలు తమ నెట్‌వర్క్ డిస్‌ప్లేను మార్చేశాయి. వొడాఫోన్ ఐడియా తన నెట్‌వర్క్ డిస్‌ప్లేను ‘వొడాఫోన్-బి సేఫ్’ అని మార్చగా, బీఎస్ఎన్ఎల్ తన డిస్‌ప్లేను ‘బీఎస్ఎన్ఎల్ స్టే ఎట్ హోం’ అని మార్చివేశాయి.   


వొడాఫోన్ ఐడియా ఇటీవల తమ ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీని ఈ నెల 17 వరకు పొడిగించడమే కాకుండా ఉచితంగా పది రూపాయల టాక్‌టైంను కూడా జోడించింది. అంతకుముందు బీఎస్ఎన్ఎల్‌ కూడా ఏప్రిల్ 20 వరకు వ్యాలిడిటీని పెంచడమే కాకుండా 10 టాక్‌టైంను ఉచితంగా ఆఫర్ చేసింది. అలాగే, వర్క్‌ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు 10 ఎంబీపీఎస్ డౌన్ స్పీడ్‌తో రోజుకు 5జీబీని ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించింది. 

Updated Date - 2020-04-03T00:24:27+05:30 IST