బీఎస్ఎన్ఎల్ అద్భుత ఆఫర్.. ఆ ప్యాక్‌తో 60 రోజుల అదనపు వ్యాలిడిటీ

ABN , First Publish Date - 2021-12-31T23:42:11+05:30 IST

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు

బీఎస్ఎన్ఎల్ అద్భుత ఆఫర్.. ఆ ప్యాక్‌తో 60 రోజుల అదనపు వ్యాలిడిటీ

న్యూఢిల్లీ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. రూ. 2,399 ప్రీపెయిడ్ రీచార్జ్‌ ప్లాన్‌పై 60 రోజుల అదనపు కాలపరిమితి ఇస్తున్నట్టు ప్రకటించింది. ఫలితంగా ఈ ప్యాక్ పూర్తి కాలపరిమితి 365 రోజుల నుంచి  425 రోజులకు పెరగనుంది.


రూ.2,399 ప్లాన్‌లో అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, వాయిస్ కాలింగ్, రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలతోపాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అలాగే, ఈరోస్ నౌ ద్వారా ఒరిజినల్స్, పాపులర్ కంటెంట్ పొందొచ్చు. డేటాను పూర్తిగా ఉపయోగించుకున్న తర్వాత ఇంటర్నెట్ వేగం 80 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.  

Updated Date - 2021-12-31T23:42:11+05:30 IST