ఏపీ, తెలంగాణ వినియోగదారుల కోసం.. బీఎస్ఎన్‌ఎల్ అదిరిపోయే డేటా ప్లాన్లు

ABN , First Publish Date - 2020-04-03T00:57:16+05:30 IST

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 693, రూ.

ఏపీ, తెలంగాణ వినియోగదారుల కోసం.. బీఎస్ఎన్‌ఎల్ అదిరిపోయే డేటా ప్లాన్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 693, రూ. 1212తో తీసుకొచ్చిన ఈ ప్లాన్లలో రోజువారీ డేటా పరిమితి ఉండదు. ఈ బల్క్ డేటా ప్రయోజనాలు ఏడాది కాలపరిమితితో లభిస్తాయి. రూ. 693 డేటా ప్లాన్‌లో 300 జీబీ డేటా లభిస్తుంది. కాలపరిమితి ఉన్నంత వరకు దీనిని వాడుకోవచ్చు. రూ.1212 ప్లాన్‌లో 500 జీబీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. దీని కాలపరిమితి కూడా 365 రోజులే.  అయితే, ఈ ప్లాన్లతో వాయిస్ కాల్స్ కానీ, ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు కానీ లభించవు. అంతేకాదు, ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. అంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలో మాత్రమే ఈ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. 

Updated Date - 2020-04-03T00:57:16+05:30 IST