మారుమూల ప్రాంతాలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌నెట్‌

ABN , First Publish Date - 2021-03-07T07:48:37+05:30 IST

జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌నెట్‌ సేవలను భాగస్వామ్య పద్ధతి (ఫ్రాంచైజ్‌) ద్వారా రాయితీతో అందిస్తున్నామని జీఎం గోపాలకృష్ణారావు వెల్లడించారు.

మారుమూల ప్రాంతాలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌నెట్‌
సమావేశంలో ప్రసంగిస్తున్న గోపాలకృష్ణారావు

జీఎం గోపాలకృష్ణారావు 


తిరుపతి(ఆటోనగర్‌), మార్చి 6: జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌నెట్‌ సేవలను భాగస్వామ్య పద్ధతి (ఫ్రాంచైజ్‌) ద్వారా రాయితీతో అందిస్తున్నామని జీఎం గోపాలకృష్ణారావు వెల్లడించారు. తిరుపతి బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది కొవిడ్‌ వల్ల ఫైబర్‌నెట్‌ సేవల అవసరాలు పెరిగాయన్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌, ఆస్పత్రులు, విద్యాసంస్థల వారికి ఈ సేవలు అవసరం అయ్యాయని చెప్పారు. ఏడాదిలోనే 85 ప్రాంతాల్లో ఐదువేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. అవసరమైనవారు ఛౌౌజుఝడజజీఛ్ఛట.ఛటుఽజూ.ఛిౌ.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. బ్రాడ్‌బాండ్‌, ఫైబర్‌నెట్‌ వినియోగదారులు వైయూపీపీటీవీ, జడ్‌ఈఈ 5 ప్రైమ్‌, సోనీలైవ్‌ టీవీల్లో వినోద కార్యక్రమాలు కేవలం రూ.129ఖర్చుతో ఓటీటీ ద్వారా అందుబాటులోని తెచ్చామన్నారు. ఈ ఆఫర్‌ మూడు నెలలపాటు ఉంటుందన్నారు. అనంతరం నెలకు రూ.199 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో డీజీఎంలు వెంకోబరావు, దామోదరం పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T07:48:37+05:30 IST