Advertisement
Advertisement
Abn logo
Advertisement

లైఫ్‌టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్లకు బీఎస్ఎన్ఎల్ మంగళం!

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ఖాతాదారులకు షాకిచ్చింది. లైఫ్‌టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్లకు మంగళం పాడింది. ఖాతాదారులందరినీ రూ. 107 ప్రీమియం పర్ మినిట్ ప్లాన్‌లోకి మార్చింది. తాజా మార్పు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.


లైఫ్‌టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అతి తక్కువ టారిఫ్‌లోనే వినియోగదారులకు బోల్డన్ని ప్రయోజనాలు లభించేవి. ఇప్పుడు వారందరూ రూ. 107 ప్లాన్‌లోకి మారనున్నారు. అయితే, ఇలా మారిన ఖాతాదారులకు ఇకపై ఉచితాలు లభించవు. 


రూ. 107 ప్లాన్‌ మొత్తం కాలపరిమితి 90 రోజులు. అపరిమిత ఇన్‌కమింగ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌తో లభించే 10 జీబీ డేటా కాలపరిమితి మాత్రం 30 రోజులే. 100 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్‌ కాలపరిమితి 24 రోజులు. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్‌ను మాత్రం 60 రోజులపాటు వినియోగించుకోవచ్చు. 


అయితే ఈ ప్లాన్‌లో 84 రోజుల కాలపరిమితితో 3జీబీ ఉచిత డేటా లభిస్తుంది. ముంబై, ఢిల్లీ సహా ఏ నెట్‌వర్క్‌కు అయినా 100 నిమిషాల ఉచిత కాల్స్  100 రోజుల పాటు నేషనల్ రోమింగ్‌తో లభిస్తాయి. అలాగే, 60 రోజులపాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ లభిస్తాయి. అయితే, లైఫ్‌టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ నుంచి రూ. 107 ప్లాన్‌లోకి మారేవారికి మాత్రం ఈ ఉచితాలు వర్తించబోవని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.  


బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 వార్షిక ప్లాన్ కాలపరిమితిని మరో 60 పెంచింది. ఫలితంగా ఇప్పుడు ఈ ప్లాన్ 425 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. సాధారణంగా అయితే ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. డిసెంబరు 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో రోజుకు 3జీబీ డేటా 80 కేబీపీఎస్ వేగంతో లభిస్తుంది. అలాగే, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement