విదేశాల్లో బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక వ్యాపార విభాగం...

ABN , First Publish Date - 2020-10-29T00:21:50+05:30 IST

ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) విదేశీ మార్కెట్ విఫణిలోకి అడుగిడనుంది. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ అంతర్జాతీయ వ్యాపార విభాగం ప్రత్యేకంగా ఏర్పాటైంది.

విదేశాల్లో బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక వ్యాపార విభాగం...

న్యూఢిల్లీ : ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) విదేశీ మార్కెట్ విఫణిలోకి అడుగిడనుంది. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ అంతర్జాతీయ వ్యాపార విభాగం ప్రత్యేకంగా ఏర్పాటైంది. 


విదేశాల్లో టెలికాం వ్యవహారాలు, సాధ్యాసాధ్యాలను తెలుసుకునేందుకు ఈ వ్యాపార విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు బీఎస్ఎన్ఎల్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ విభాగం ద్వారా ఇతర కంపెనీలను కైవసం చేసుకోవడం, లైసెన్సుల కోసం బిడ్‌లను ప్రకటించడం వంటివి చేయనున్నట్లు ః పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్‌లోనికి ప్రవేశించే క్రమంలో పీఎస్‌యూ నుండి అనుమతి లభించిందని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ కుల్దీప్ గోయల్ గతంలో వెల్లడించారు. 

Updated Date - 2020-10-29T00:21:50+05:30 IST