బీఎఎ్‌సఎన్‌ఎల్‌ 4జి ఫ్రీ సిమ్‌ ఆఫర్‌

ABN , First Publish Date - 2020-10-01T08:00:37+05:30 IST

బీఎ్‌సఎన్‌ఎల్‌ 4జీ ఫ్రీ సిమ్‌ ఆఫర్‌ అందిస్తోందని బీఎ్‌సఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ విఠల్‌ దుర్గా ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 108తో రీఛార్జి చేసుకునేవారికి 60

బీఎఎ్‌సఎన్‌ఎల్‌ 4జి ఫ్రీ సిమ్‌ ఆఫర్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 30: బీఎ్‌సఎన్‌ఎల్‌ 4జీ ఫ్రీ సిమ్‌ ఆఫర్‌ అందిస్తోందని బీఎ్‌సఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ విఠల్‌ దుర్గా ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 108తో రీఛార్జి చేసుకునేవారికి 60 రోజుల పాటు అపరిమితమైన కాల్స్‌, రోజుకు 1 జీబీ డేటా, 600 ఎస్‌ఎంఎ్‌సలు లభిస్తాయని, ప్లాన్‌ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుందని తెలిపారు. కొవిడ్‌ దృష్ట్యా స్కూల్‌ పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్‌కు ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగుల సౌకర్యార్థం ఎస్‌టీవీ - 599 అందుబాటులో ఉందన్నారు.


దీని కాల పరిమితి 90 రోజులు అని, అపరిమితమైన కాల్స్‌, 5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎ్‌సలు లభిస్తాయన్నారు. ఇక దీర్ఘకాలిక ప్లాన్‌లో భాగంగా పీవీ-365 సంవత్సరకాల పరిమితితో 60 రోజుల పాటు 2 జీబీ డేటా, అపరిమితమైన కాల్స్‌ లభిస్తాయని తెలిపారు. పీవీ- 1499 (బిందాస్‌ బోల్‌) ప్లాన్‌తో ఒక సంవత్సరం, 30 రోజులు అదనపు కాలపరిమితితో అపరిమితమైన కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎ్‌సలు, 24 జీబీ డేటా (మొత్తం కాలపరిమితి) లభిస్తుందని, ఈ అవకాశం ఆఫర్‌ ఉన్నంత వరకే ఉంటుందన్నారు. 

Updated Date - 2020-10-01T08:00:37+05:30 IST