మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మళ్లీ పెళ్లి.. అదేంటని నిలదీసేందుకు వెళితే ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-06-22T02:37:52+05:30 IST

అతనికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. అదనపు కట్నం తీసుకురాలేదని, మగ పిల్లాడిని కనలేదని ఆమెను నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి తరిమేశాడు

మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మళ్లీ పెళ్లి.. అదేంటని నిలదీసేందుకు వెళితే ఏం చేశాడంటే..

అతనికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. అదనపు కట్నం తీసుకురాలేదని, మగ పిల్లాడిని కనలేదని భార్యను నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి తరిమేశాడు.. ఆమెకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.. భర్త పెళ్లి చేసుకున్న విషయం మొదటి భార్యకు తాజాగా తెలిసింది.. దీంతో ఆమె భర్తను నిలదీసింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు.. ఆమె తప్పించుకున్నప్పటికీ ఆమె మేనల్లుడు గాయపడ్డాడు. 


ఇది కూడా చదవండి..

వీళ్లసలు తల్లిదండ్రులేనా..? మద్యం కొనుక్కునేందుకు డబ్బుల్లేక 2 నెలల కొడుకును రూ.30 వేలకు అమ్మేశారు..!


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ రాజావత్‌‌కు 12 ఏళ్ల క్రితం ఉషారాణితో వివాహం జరిగింది. అదనపు కట్నం కావాలంటూ ఆమెను వేధించేవాడు. తరచుగా కొట్టేవాడు. 2018లో ఆ మహిళకు ఆడపిల్ల పుట్టడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఆమెను కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఆ తర్వాత 2019లో మరో వివాహం చేసుకున్నాడు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్న విషయం ఉషారాణికి మూడ్రోజుల క్రితం తెలిసింది. దీంతో ఆమె నేరుగా భర్త ఇంటికి వెళ్లి నిలదీసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఆమెపై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. మహిళ చాకచక్యంగా తప్పించుకుంది. అయితే ఆమె మేనల్లుడి భుజంలోకి ఓ తూటా వెళ్లింది. 


అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ తన మేనల్లుడిని హాస్పిటల్‌లో చేర్పించి నేరుగా జిల్లా ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లింది. జరిగిన ఘటన మొత్తాన్ని ఎస్పీకి వివరించింది. తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పింది. తనకు విడాకులు ఇవ్వకుండా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్సైను ఎస్పీ ఆదేశించారు. 

Updated Date - 2022-06-22T02:37:52+05:30 IST