పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం భగ్నం

ABN , First Publish Date - 2020-09-27T20:59:00+05:30 IST

పాకిస్థాన్ దుష్ట పన్నాగాలను మరోసారి సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్) తిప్పికొట్టాయి. సాంబా..

పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం భగ్నం

సాంబ: పాకిస్థాన్ దుష్ట పన్నాగాలను మరోసారి సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్) తిప్పికొట్టాయి. సాంబా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత చొరబాటు యత్నానికి పాక్ పాల్పడింది. దీనిని పసిగట్టిన భారత భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టు బీఎస్ఎఫ్ ఒక అధికార ప్రకటనలో వెల్లడించింది.


అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ వైపు నుంచి ఐదుగురు ఉగ్రవాదుల కదలికలను బీఎస్ఎఫ్ పసిగట్టి, అప్రమత్తమైనట్టు అధికారులు తెలిపారు. దట్టమైన చీకటిలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా, బీఎస్ఎఫ్ పార్టీ రేంజర్లు తిప్పికొట్టినట్టు చెప్పారు. ఈనెల 14-15 తేదీల్లో కూడా సాంబ సెక్టార్ వెంబడి పాక్ చొరబాటు యత్నాలను బీఎస్ఎఫ్ విఫలం చేసింది.

Updated Date - 2020-09-27T20:59:00+05:30 IST