ఇద్దరు పాకిస్థానీ జాలర్ల అరెస్ట్.. నాలుగు బోట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2022-05-26T22:26:31+05:30 IST

బీఎస్ఎఫ్ అధికారులు నేడు గుజరాత్‌లోని భుజ్ సమీపంలో ఇద్దరు పాకిస్థానీ జాలర్లను అరెస్ట్ చేసి వారి

ఇద్దరు పాకిస్థానీ జాలర్ల అరెస్ట్.. నాలుగు బోట్లు స్వాధీనం

అహ్మదాబాద్: బీఎస్ఎఫ్ అధికారులు నేడు గుజరాత్‌లోని భుజ్ సమీపంలో ఇద్దరు పాకిస్థానీ జాలర్లను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు చేపలు పట్టే బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో హరామీ నాలా ప్రాంతంలో పాకిస్థానీ బోట్ల కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్ (BSF) పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని జాలర్లను అదుపులోకి తీసుకున్నారు.


వారి నుంచి నాలుగు దేశీయ తయారీ పడవలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాటిలో చేపలు, వలలు, చేపలు పట్టే సాధనాలు తప్ప మరేవీ లేవని గుర్తించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 25న గుజరాత్ తీరంలో తీర రక్షక దళం (ICG), గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ATS) అధికారులు పాకిస్థాన్ బోటును, 9 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 280 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-05-26T22:26:31+05:30 IST