Sirisilla Mahila Gurukulamలో బీఎస్సీ ఆనర్స్‌

ABN , First Publish Date - 2022-08-08T22:13:09+05:30 IST

‘తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమితి (టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్‌) - సిరిసిల్ల(Sirisilla Mahila Gurukulam)లోని సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ‘బీఎస్సీ

Sirisilla Mahila Gurukulamలో బీఎస్సీ ఆనర్స్‌

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమితి (టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్‌) - సిరిసిల్ల(Sirisilla Mahila Gurukulam)లోని సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ‘బీఎస్సీ ఆనర్స్‌ ఇన్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ’లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. మొత్తం 40 సీట్లు ఉన్నాయి. ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. 

అర్హత: ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.  ఇంటర్‌ ఒకేషనల్‌(కమర్షియల్‌ గార్మెంట్‌ టెక్నాలజీ) కోర్సు పూర్తిచేసినవారు కూడా అర్హులే. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు; గ్రామాల్లో రూ.లక్షన్నర మించకూడదు. 

డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌: ఇందులో రెండు సెక్షన్‌లు ఉంటాయి. మొదటిది జనరల్‌ ఎబిలిటీ. దీనికి 30 మార్కులు కేటాయించారు. లాజికల్‌ ఎబిలిటీ, బేసిక్‌ మేథ్స్‌, కాంప్రహెన్షన్‌, ఇంగ్లీష్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రెండోది డిజైన్‌ ఎబిలిటీ. దీనికి 70 మార్కులు నిర్దేశించారు. గార్మెంట్‌ ఇండస్ట్రీ, డిజైన్‌ ఎబిలిటీ, బేసిక్‌ డ్రాయింగ్‌, స్కెచింగ్‌, కలరింగ్‌, ఈస్థటిక్స్‌ అప్రిసియేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. ఈ టెస్ట్‌లో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతోపాటు షార్ట్‌ ఆన్సర్‌ ప్రశ్నలు కూడా ఉంటాయి. మొత్తం మార్కులు 100. అభ్యర్థులు  కలర్‌ పెన్సిల్స్‌, ఎరేజర్‌, పెన్సిల్స్‌, స్కెచ్‌ పెన్స్‌ వంటి బేసిక్‌ స్టేషనరీని తమవెంట తీసుకెళ్లాలి. 

 

ముఖ్య సమాచారం

పరీక్ష ఫీజు: రూ.150 

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 24 

వెబ్‌సైట్‌: www.tswreis.ac.in

Updated Date - 2022-08-08T22:13:09+05:30 IST