విజయవాడ: నగరంలోని దుర్గ అగ్రహారంలో దారుణం జరిగింది. దుండగులు కత్తులతో నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిని కొంతమంది దారుణంగా నరికి చంపారు. ఆలమూరి రామారావు(32) అనే వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. దుండగులను పట్టుకోవడానికి సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.