2 నిముషాల్లో బ్రష్ చేయడం ముగించేస్తే ఈ ముప్పు తప్పదు... హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!

ABN , First Publish Date - 2022-07-20T15:43:43+05:30 IST

దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల...

2 నిముషాల్లో బ్రష్ చేయడం ముగించేస్తే ఈ ముప్పు తప్పదు... హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!

దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే నేటికీ చాలా మంది 'ఓరల్ హెల్త్'కి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. యూకేలో 2 వేలమందిపై జరిపిన సర్వేలో దాదాపు సగం మందికి సరిగ్గా పళ్ళు తోముకునే మార్గం తెలియదని తేలింది. ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే సరిగ్గా బ్రష్ చేస్తారని ఒక అధ్యయనంలో తేలింది. సరిగ్గా బ్రష్ చేసుకోని వారికి డిమెన్షియా రావచ్చు. ఇది దంత క్షయానికి దారితీస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దంత క్షయాన్ని నివారించడానికి, కనీసం రోజుకు ఒకసారైనా దంతాలను బ్రష్ చేయాలి. నోటి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోతే గుండె జబ్బులు లేదా మధుమేహం బారిన పడే అవకాశాలున్నయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 


గుండె ఆరోగ్యంతో నోటి ఆరోగ్యంతో ముడిపడి ఉందనే విషయం చాలామందికి తెలియదు. దంత, చిగుళ్ల వ్యాధులు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. దీనిని నివారించడానికి దంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే  చిగుళ్లలో సమస్యలు ఉంటే వీలైనంత త్వరగా హార్ట్ చెకప్ చేయించుకోవడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రష్ చేయడం అంటే పళ్లలో చిక్కుకున్న ఆహార అవశేషాలను తొలగించడం, తాజాగా అనుభూతి చెందడం మాత్రమేనని చాలా మంది అనుకుంటారు. ఇది నిజం కాదు. దంతాల నుండి బ్యాక్టీరియాను తొలగించడం చాలా ముఖ్యం. రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తూ అందుకోసం కనీసం రెండు నిమిషాలకుపైగా సమయాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒక అధ్యయనంలో తేలిన గణాంకాల ప్రకారం, కేవలం 25% మంది మాత్రమే సరైన పద్ధతితో పళ్ళు తోముకుంటారు. దంతాలతో పాటు చిగుళ్లకు కూడా బ్రష్ చేయాలి. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం నోటిలోని బ్యాక్టీరియా కేవలం నీటితో మాత్రమే తొలగిపోదు. అందుకు సరైన పద్ధితిలో బ్రష్ చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కనీసం నెల రోజుల తర్వాత వారి బ్రష్‌ను మార్చుకోవాలి. ఇంతేకాకుండా తడి బ్రష్‌ను హోల్డర్‌లో ఉంచితే దానిలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. బ్రష్‌ను, బ్రష్ హోల్డర్‌ను వారానికోసారి వేడి నీళ్లలో వేసి, కాసేపు అలాగే ఉంచితే వాటిలో బ్యాక్టీరియా పేరుకుపోదు. బ్రష్ హోల్డర్‌ను సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో ఉంచేందుకు ప్రయత్నించండి. దంతాలను శుభ్రం చేయడానికి వేప, రోజ్‌వుడ్, మామిడి కొమ్మలను ఉపయోగించవచ్చు. వాటికున్న చేదు నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా దంతాలు, చిగుళ్లను బలపరుస్తుంది. చేదు మూలికలు నోటిలోని బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి. నోటి దుర్వాసనను తరిమికొడతాయి.



Updated Date - 2022-07-20T15:43:43+05:30 IST