తెలంగాణకు అరుదైన గుర్తింపు తెచ్చారు

ABN , First Publish Date - 2022-05-28T06:01:44+05:30 IST

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణకు అరుదైన గుర్తింపు తెచ్చారని హర్యానా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పర్వతారోహకురాలు అన్వితారెడ్డిని అభినందించారు. యాదగిరిగుట్ట మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన పడమటి అన్వితారెడ్డికి శుక్రవారం ఈ మేరకు మెయిల్‌ ద్వారా అభినందన లేఖను పంపారు.

తెలంగాణకు అరుదైన గుర్తింపు తెచ్చారు

మా అందర్నీ గర్వపడేలా చేశారు

ఈ విజయం యువతకు ఎంతో ప్రేరణ 

పర్వతారోహకురాలు అన్వితారెడ్డికి హర్యానా రాష్ట్ర గవర్నర్‌ అభినందన లేఖ 

యాదాద్రి, మే 27 (ఆంధ్రజ్యోతి): ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణకు అరుదైన గుర్తింపు తెచ్చారని హర్యానా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పర్వతారోహకురాలు అన్వితారెడ్డిని అభినందించారు. యాదగిరిగుట్ట మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన పడమటి అన్వితారెడ్డికి శుక్రవారం ఈ మేరకు మెయిల్‌ ద్వారా అభినందన లేఖను పంపారు. చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి, పెద్ద ఘనత సాధించారని ప్రశంసించారు. ఎవరెస్ట్‌ ఎక్కాలన్న కలను ఉత్సాహం, ధృఢసంకల్పంతో కొనసాగించారనే వాస్తవాన్ని అంగీకరించడం ఎనలేని ఆనందాన్ని ఇస్తోందని సంతోషం వ్యక్తంచేశారు. ఈ విజయం యువతకు ఎంతో ప్రేరణనిస్తుందని, ఎన్నో అసమానతలను ధైర్యంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యున్నత శిఖరాన్ని అధిరోహించేందుకు ఎన్నో కష్టాలను జయించారని అభినందించారు. ఇప్పటికే కిలిమంజారో, ఖాడే, ఎల్‌బ్రోస్‌, రెన్‌రాక్‌ పర్వతాలను అధిరోహించగా, దేశానికి, తెలంగాణకు మరిన్ని విజయాలు అందిస్తూనే ఉంటారన్న నమ్మకం ఉందన్నారు.

Updated Date - 2022-05-28T06:01:44+05:30 IST