Abn logo
Sep 28 2021 @ 12:26PM

సోదరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.. తర్వాత చేస్తుందిలే అనుకున్నారు కానీ..

12 రోజుల క్రితం ఆ తమ్ముడు తన అక్కతో చివరిసారిగా మాట్లాడాడు. అప్పుడు... ఆమె బాగానే ఉన్నానని చెప్పింది. అయితే ఆ తరువాత తిరిగి మరెప్పుడూ ఆ అక్క... అతనితో మాట్లాడలేదు. దీంతో అతను అక్కకు పలుమార్లు ఫోన్ చేశాడు. ఒక్కసారి కూడా ఆమె కాల్ రిసీవ్ చేసుకోలేదు. తమ ఏకైక అక్క ఇక లేదని ఆ ముగ్గురు అన్నదమ్ములు గ్రహించలేకపోయారు... ఇది ప్రీతి తమ్ముడు దీపక్ దీన గాథ. అహ్మదాబాద్‌(గుజరాత్)లో పనిచేస్తున్న అతను తమ ఏకైక సోదరి ఈవిధంగా లోకాన్ని విడిచివెళ్లిపోతుందని అస్సలు అనుకోలేదు.

ఈ విషయం తెలిసిన వెంటనే అతను ప్రైవేటు టాక్సీ పట్టుకుని, తన సోదరి ఉంటున్న గ్వాలియర్‌కు బయలుదేరాడు. ఇక తాము తమ సోదరిని ఎప్పటికీ చూడలేమనే ఆలోచనతో దీపక్ గుండె బరువెక్కింది. ఈ సందర్భంగా దీపక్ ప్రజాపతి మీడియాతో మాట్లాడుతూ తాము ముగ్గురు సోదరులమని, తమకు ఒక అక్క ఉన్నదని తెలిపారు. అక్కను తాము ఎంతగానో ఇష్టపడతామన్నారు. తామంతా అహ్మదాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటామన్నారు. తమ అక్క ప్రీతి(28)ని రక్షాబంధన్ రోజున... బావ రాజ్‌కుమార్‌ కొట్టడంతో అక్కను తమ ఇంటికి తీసుకువచ్చామన్నారు. తరువాత ఆమెను తమ ఇంటిలోనే ఉంచాలని నిర్ణయించుకున్నామన్నారు. అయితే జన్మాష్టమి రోజున బావ మద్యం మత్తులో మా ఇంటికి వచ్చి, అక్కను ఇక ఎప్పుడూ వేధించనని మాట ఇచ్చి, అతనితో పాటు బలవంతంగా తీసుకువెళ్లాడన్నారు. ఆ తరువాత సోదరిని చూసే అవకాశమే తమకు కలగలేదన్నారు.

తమ సోదరిని... బావ తరచూ వేధించేవాడని, అతని తల్లి కూడా కొడుకుకు వత్తాసు పలికేదన్నారు. ఈ వేధింపుల కారణంగా తమ అక్క ప్రీతి ఉరివేసుకున్నదని, అలాగే ఆమె వారి మూడేళ్ల కుమారునికి కూడా ఉరివేసిందని తెలిపారు. సంఘటనా స్థలంలో ఐదుపేజీల సూసైడ్ నోట్ లభ్యమయ్యిందన్నారు. ప్రీతి సోదరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లీకుమారుల మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...