చెల్లికి న్యాయం చేయాలని.. ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు బయల్దేరిన అన్న

ABN , First Publish Date - 2022-05-29T01:09:20+05:30 IST

కర్నూలు: తన చెల్లికి జరిగిన అన్యాయాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఢిల్లీకి ఎడ్లబండిపై పయనమయ్యాడు. ఈ ఘటనను

చెల్లికి న్యాయం చేయాలని.. ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు బయల్దేరిన అన్న

కర్నూలు: తన చెల్లికి జరిగిన అన్యాయాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఢిల్లీకి ఎడ్లబండిపై పయనమయ్యాడు. ఈ ఘటనను కర్నూలులోని మానవ హక్కుల సంఘం సీరియస్‌గా తీసుకుంది. వెంటనే నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. నవ్యతకు ఆమె భర్త నరేంద్రనాథ్ అన్యాయం చేశాడు. దీంతో న్యాయం కోసం ఆమె అన్న నాగ దుర్గారావు ఢిల్లీకి ఎడ్లబండిపై బయల్దేరాడు. తన చెల్లికి జరిగిన అన్యాయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని HRC తీవ్రంగా పరిగణించింది. సుమోటోగా స్వీకరించి జుడిషియల్ మెంబర్ దండే సుబ్రహ్మణ్యం ప్రతివాది అయిన కొంగర నరేంద్రనాథ్‌తో పాటు చందర్లపాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్, నందిగామ డీఎస్పీ, ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని, కేసు విచారణ జూన్ 13‌కు వాయిదా వేశారు. 

Updated Date - 2022-05-29T01:09:20+05:30 IST