Abn logo
Jun 9 2020 @ 08:08AM

అన్నను హత్య చేసిన తమ్ముడు

Kaakateeya

హైదరాబాద్/దుండిగల్‌ : ఆర్థిక లావాదేవీలతోపాటు ఇతరత్రా విషయాల్లో సోదరుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలు అన్న హత్యకు దారితీశాయి. సూరారం కాలనీ మార్కెట్‌ రోడ్డులో నివసిస్తున్న మహ్మద్‌ సదాక్‌కు ఇద్దరు కుమారులు సాబేర్‌(29), అజాం(27). అజాం మెడికల్‌ షాపు నిర్వహిస్తుంటాడు. సోదరులిద్దరి మధ్య ఆర్థిక, ఇతర విషయాలపై ఆదివారం గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన అజాం సాబేర్‌ను ఆ రోజు రాత్రి చద్దర్‌ సహాయంతో హత్య చేసి పారిపోయినట్లు దుండిగల్‌ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement