Abn logo
Oct 29 2020 @ 06:16AM

డబ్బుల కోసం అన్నపై కొడవలితో దాడి

హైదరాబాద్/సైదాబాద్‌ : అన్నపై తమ్ముడు కొడవలితో దాడి చేశాడు. ఈ సంఘటన సైదాబాద్‌ పోలీ‌స్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అహ్మద్‌(43) 2006లో ఎల్‌బీనగర్‌లో జరిగిన ఓ హత్యకేసులో పదేళ్ల జైలు శిక్ష అనుభవించి ఆరు నెలల క్రితం విడుదలై సింగరేణి గుడిసెలలో నివాసముంటున్నాడు. అహ్మద్‌ అన్న అరిబ్‌ సమీపంలోని వాంబేగృహాలలో కుటుంబంతో ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం అహ్మద్‌ అరిబ్‌ భార్యతో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గొడవపడుతుండగా వారించాడు. దీంతో అరిబ్‌పై అహ్మద్‌ కొడవలితో దాడి చేయగా చేతికి గాయమైంది. సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు.   కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement