చీపురు పట్టిన కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగులు

ABN , First Publish Date - 2021-06-18T06:41:16+05:30 IST

వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉ ద్యోగులు రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు.

చీపురు పట్టిన కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగులు
చీపురు పట్టి రోడ్లు ఊడ్చి నిరసన తెలుపుతున్న దృశ్యం

గుత్తి, జూన 17: వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉ ద్యోగులు రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. చీపురు పట్టి స్థానిక ఆస్పత్రి ఆవరణాన్ని శుభ్రం చేస్తూ  నిరసన వ్యక్తం చేశారు. 17 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన చేపడుతు న్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్‌ చేయాలన్నారు. ఏపీజీఈఏ అధ్యక్షుడు మక్బుల్‌ సాహె బ్‌ మద్దతిచ్చారు. నిరసనలో రామకృష్ణ, వన్నూరువలి, ఆంజినేయులు, ష ఫ్రూల్లా, జగన, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.


బొమ్మనహాళ్‌ :మండలంలోని ఉద్దేహాళ్‌ ఆరోగ్య ఉప కేంద్రం వద్ద ప్రభు త్వం పారామెడికల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నాలుగో రోజు గురువారం నిరసన కొనసాగిది. ఈ సందర్భంగా పారామెడికల్‌ ఉద్యోగులు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ డీఎస్సీ కాంట్రాక్ట్‌ పారామెడికల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. మేనిఫెస్టోలో హామీ లను అమలుపరచి, కొవిడ్‌ సమయంలో మరణించిన ఉద్యోగి కుటుంబాల ను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెం డేళ్లు పూర్తయినా పారామెడికల్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ యుగంధర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ గోవర్దన, ఏఎనఎం రమాదేవి, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T06:41:16+05:30 IST