నాలుగేళ్లుగా నిద్రలేకుండా.. ఇబ్బందుల్లో మహిళ..!

ABN , First Publish Date - 2022-01-07T03:11:50+05:30 IST

ఒక్క రాత్రి నిద్ర లేకపోతేనే మరుసటి రోజు చిన్న పని కూడా చేయలేని స్థితి ఉంటుంది. అలాంటిది.. నాలుగేళ్ల పాటు సరైన నిద్రలేకుండా ఉంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. లండన్‌కు చెందిన మాల్గోర్జాటా సిల్విస్కా అనే మహిళ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంటోంది.

నాలుగేళ్లుగా నిద్రలేకుండా.. ఇబ్బందుల్లో మహిళ..!

ఇంటర్నెట్ డెస్క్: ఒక్క రాత్రి నిద్ర లేకపోతేనే మరుసటి రోజు చిన్న పని కూడా చేయలేని స్థితి ఉంటుంది. అలాంటిది.. నాలుగేళ్ల పాటు సరైన నిద్రలేకుండా ఉంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. లండన్‌కు చెందిన మాల్గోర్జాటా సిల్విస్కా అనే మహిళ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంటోంది. వారంలో రెండు రోజుల కూడా మంచి నిద్రపట్టని దుస్థితి ఆమెది. ఈ పరిస్థితి కారణంగా  ఆమె జీవితంలో ఆనందానికి దూరమైపోయింది. డిప్రెషన్, కారణంగా లేకుండా ఏడుపు రావడం.. దేనిమీదా మనసు లగ్నం కాకపోవడం.. ఇదీ ఆమె పరిస్థితి. 2017లో ఆమెకు ఈ సమస్య ఎదురైంది. ఆ తరువాత.. ఎన్ని మందులు వాడినా, ఎన్ని రకాల ఎక్సర్‌సైజులు చేసినా ఆశించిన ఫలితంగా మాత్రం ఆమెకు అందలా. అంతకుమునుపు ఆమె అందరిలాగే కంటి నిండా నిద్రపోయేది. కానీ.. 2017లో ఆమె పరిస్థితి తారుమారైంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ఆమె ప్రస్తుతం సతమతమవుతోంది. 

Updated Date - 2022-01-07T03:11:50+05:30 IST