Goa బీచ్‌లో దారుణం...British Womanపై అత్యాచారం

ABN , First Publish Date - 2022-06-07T13:08:27+05:30 IST

గోవా బీచ్‌లో దారుణం జరిగింది. ఉత్తర గోవాలోని అరాంబోల్ బీచ్ సమీపంలోని ప్రసిద్ధ స్వీట్ లేక్ వద్ద బ్రిటిష్ మహిళపై అత్యాచారం జరిగింది...

Goa బీచ్‌లో దారుణం...British Womanపై అత్యాచారం

పనాజీ (గోవా): గోవా బీచ్‌లో దారుణం జరిగింది. ఉత్తర గోవాలోని అరాంబోల్ బీచ్ సమీపంలోని ప్రసిద్ధ స్వీట్ లేక్ వద్ద బ్రిటిష్ మహిళపై అత్యాచారం జరిగింది.ఓ బ్రిటీష్ మహిళ తన భర్తతో కలిసి గోవా పర్యటనకు వచ్చింది. మధ్య వయస్కురాలైన బ్రిటీష్ మహిళ అరాంబోల్ బీచ్ సమీపంలోని ప్రసిద్ధ స్వీట్ లేక్ వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా 32 ఏళ్ల జోయెల్ విన్సెంట్ డిసౌజా ఆమెపై అత్యాచారం చేశాడని గోవా పోలీసులు చెప్పారు.ఈ నెల 2వతేదీన జరిగిన ఈ ఘటనపై బ్రిటీష్ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన గోవా పోలీసులు నిందితుడైన జోయెల్ విన్సెంట్ డిసౌజాను అరెస్ట్ చేశారు.అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని గోవా పోలీసు అధికారి తెలిపారు.


Updated Date - 2022-06-07T13:08:27+05:30 IST