Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్రిటన్‌లో భారతీయ సంతతి వ్యక్తి హత్య.. ప్రముఖ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్ కోసమని..

ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లో భారత సంతతి బాలుడి హత్య కేసులో అక్కడి స్కాట్‌ల్యాండ్ యార్డ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగులకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు ముందుకు రావాలని తాజాగా కోరారు. స్థానికంగా నివసించే అష్మిత్ సింగ్(16) అనే బాలుడు గురువారం హత్యకు గురయ్యాడు. అతడి వద్ద ఉన్న గుచ్చీ(ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్) బ్యాగును దొంగిలించేందుకే దుండగులు అతడిపై దాడి చేసి ఉంటారని అతడి స్నేహితులు ఆరోపిస్తున్నారు. 

దాడి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పారామెడికల్ సిబ్బంది అతడి రక్షించేందుకు విశ్వప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. ఘటనా స్థలంలోనే బాలుడు మరణించాడు. అతడి దేహంపై కత్తి గాయాలు ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. అయితే..ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు స్థానికులను ప్రశ్నిస్తున్నారు. కాగా.. కేవలం ఓ బ్యాగు విషయంలో  అష్మిత్ సింగ్ ప్రాణాలు పోగొట్టుకోవడంపై అతడి స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడు ధరించిన గుచ్చీ బ్యాగ్ నకిలీదని వారు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement