భారతీయుడితో Britain దౌత్యవేత్త వివాహం.. నెటిజన్లను అబ్బురపరుస్తున్న ఉదంతం..

ABN , First Publish Date - 2022-02-19T23:26:24+05:30 IST

ప్రేమ ఎప్పుడు చిగురిస్తుందో చెప్పడం కష్టం. అంతేకాదు.. ప్రేమకు జాతి, కుల, మత, భౌగోళిక సరిహద్దులేవీ ఉండవు. ఒకసారి ప్రేమలో పడ్డాక జీవితం అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఇక సామాజిక అడ్డంకులు అతి తక్కువగా ఉన్న నేటి ఆధునిక కాలంలో.. ప్రేమ వ్యవహారాలు పెళ్లిపీటల దాకా సులువుగానే వెళ్లిపోతున్నాయి. ఇందుకు గతంలో ఎన్నో ఉదాహరణలు ఉండగా.. తాజాగా..

భారతీయుడితో  Britain దౌత్యవేత్త వివాహం.. నెటిజన్లను అబ్బురపరుస్తున్న ఉదంతం..

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమ ఎప్పుడు చిగురిస్తుందో చెప్పడం కష్టం. అంతేకాదు.. ప్రేమకు జాతి, కుల, మత, భౌగోళిక సరిహద్దులేవీ ఉండవు. ఒకవేళ ఉన్నా.. అవి ఈ భావోద్వేగం ముందు నిలువలేవు. ఒకసారి ప్రేమలో పడ్డాక జీవితం అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఇక సామాజిక అడ్డంకులు అతి తక్కువగా ఉన్న నేటి ఆధునిక కాలంలో.. ప్రేమ వ్యవహారాలు పెళ్లిపీటల దాకా సులువుగానే వెళ్లిపోతున్నాయి. ఇందుకు గతంలో ఎన్నో ఉదాహరణలు ఉండగా.. తాజాగా ఓ బ్రిటన్ దౌత్యవేత్త ఉదంతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘‘నాలుగేళ్ల క్రితం నేను ఎన్నో ఆశలు, కలలతో భారత్‌లో అడుగుపెట్టాను. కానీ.. ఇక్కడ నా మనసుకు నచ్చిన వ్యక్తిని కలుస్తానని, వివాహ బంధంలో అడుగుపెడతానని అస్సలు అనుకోలేదు. అంతటి ఆనందం నాకు భారత్‌లో లభించింది’’ అంటూ బ్రిటన్ దౌత్యవేత్త రియానన్ హారిస్ తాజాగా ట్వీట్ చేశారు. ఇటీవలే రియానన్ వివాహం జరగ్గా..  ఆమె మనసు గెలిచిన వరుడు మన భారతీయుడే. అతడి పేరు హిమాన్షూ పాండే. 


రియానన్.. ఈ గుడ్‌న్యూస్‌ను నెటిజన్లతో పంచుకోవడంతో పాటూ భర్తతో జంటగా దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.  భారతీయ సంప్రాదాయక దుస్తుల్లో, నుదుటిపై బొట్టు పెట్టుకుని, కొత్త అందంతో మెరిసిపోతున్న రియానన్‌ను చూసి నెటిజన్లు అబ్బురుపడుతున్నారు.  ‘‘ఈ జంట కలకాలం సుఖసంతోషాలతో జీవించాలి’’ అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మరో నెటిజన్ చేసిన వ్యాఖ్యలకు ఏకంగా బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా స్పందించారు. ‘‘130 కోట్ల మంది ఉన్న మా కుటుంబంలోకి స్వాగతం’’ అని ఆ నెటిజన్ కామెంట్ చేయగా.. స్పందించిన ఫ్లెమింగ్.. ‘‘ ఆమె మీ అందరినీ త్వరలోనే రౌండ్ టేబుల్ డిన్నర్‌కి కూడా పిలవచ్చు’’ అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు. అన్నట్టు.. రియానన్ భర్త హిమాన్షూ.. ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్. గాడ్‌రాక్‌ఫిలిమ్స్‌ సంస్థను స్థాపించారు. ఇక రియానన్ హారిస్.. న్యూఢిల్లీలో బ్రిటన్ డిప్యూటీ ట్రేడ్ కమిషనర్‌గా దక్షిణాసియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు.



Updated Date - 2022-02-19T23:26:24+05:30 IST