Viral News: ఆ టాయిలెట్‌ను కనిపెట్టడమే లక్ష్యం.. రూ.1.3కోట్లు ఖర్చు పెట్టి.. 91దేశాల్లో పర్యటించిన బ్లాగర్.. చివరికి..

ABN , First Publish Date - 2022-09-25T16:53:07+05:30 IST

బ్రిటన్‌కు చెందిన 58ఏళ్ల ఓ బ్లాగర్‌కు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచంలోనే అత్యంత చెత్త టాయిలెట్‌ను కనిపెట్టేందుకు అతడు పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. రూ.1.3కోట్లు ఖర్చు చేసి మరీ.. 91దేశాల్లో పర్యటించాడు. అయితే చివరికి అతడి అన్వేషణ ఫలించింది. వరల్డ్ డర్టీస్ట్ టాయిలెట్ జాడను

Viral News: ఆ టాయిలెట్‌ను కనిపెట్టడమే లక్ష్యం.. రూ.1.3కోట్లు ఖర్చు పెట్టి.. 91దేశాల్లో పర్యటించిన బ్లాగర్.. చివరికి..

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌కు చెందిన 58ఏళ్ల ఓ బ్లాగర్‌కు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచంలోనే అత్యంత చెత్త టాయిలెట్‌ను కనిపెట్టేందుకు అతడు పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. రూ.1.3కోట్లు ఖర్చు చేసి మరీ.. 91దేశాల్లో పర్యటించాడు. అయితే చివరికి అతడి అన్వేషణ ఫలించింది. వరల్డ్ డర్టీస్ట్ టాయిలెట్ జాడను అతడు కనిపెట్టాడు. దీంతో అతడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అయింది. కాగా.. ఇంతకూ ఆ బ్లాగర్ ఎవరు? ఎందుకోసమని ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు? అతడు కనిపెట్టిన ఆ పరమచెత్త టాయిలెట్ ఎక్కడుంది? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే.. తప్పకుండా పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. 


బ్రిటన్‌కు చెందిన గ్రాహమ్ హస్కీ (Graham Askey).. కొద్ది రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకున్నాడు. పరమచెత్త టాయిలెట్‌ను గుర్తించేందుకు ప్రపంచ యాత్రను ప్రారంభించాడు. ఇందులో భాగంగానే సుమారు రూ.1.3కోట్లు ఖర్చు పెట్టి.. 90 దేశాల్లోని మారుమూల గ్రామాలను, నగరాలను సందర్శించాడు. ఫైనల్‌గా తజకిస్థాన్‌( Tajikistan)లో దాన్ని గుర్తించాడు. అఫ్గానిస్థాన్‌ సరిహద్దుకు దగ్గరగా తజకిస్థాన్‌లోని ఐనీ(Ayni) అనే ప్రాంతంలో పరమచెత్త టాయిలెట్( world's worst toilet) ఉన్నట్టు తన బ్లాగ్ పేజీలో పేర్కొన్నాడు. రాళ్లపై క్లాత్‌తో నిర్మించిన ఆ టాయిలెట్‌ను గ్రాహమ్ హస్కీ నరక కూపంతో పోల్చాడు. ఈ టాయిలెట్‌లో టాయిలెట్ పేపర్‌గా క్లాత్‌ను ఉపయోగిస్తున్నట్టు చప్పాడు. రాళ్ల మధ్య నుంచి పాములు, ఎలుకలు వస్తాయని పేర్కొన్న ఆయన.. ఇది ఉపయోగించడం ప్రమాదకరంగా చెప్పుకొచ్చాడు. 



ఈ ప్రపంచ యాత్రకు కారణం ఏంటంటే..

వెకేషన్ సందర్భంగా గ్రాహమ్ హస్కీ మొరాకోను సందర్శించాడట. అక్కడ నాణ్యతాలోపంతో నిర్మించిన టాయిలెట్‌లను చూసి అతడు ఆశ్చర్యపోయాడట. సరిగ్గా అప్పుడే.. ఈ యాత్రకు సంబంధించిన ఆలోచన తన మదిలో మెదిలిందట. దీంతో వెంటనే ప్రపంచ యాత్రను చేపట్టాడట. ఈ యాత్రంలో భాగంగా 75వేల మైళ్లు ప్రయాణించినట్టు గ్రాహమ్ హస్కీ చెప్పాడు. 


Updated Date - 2022-09-25T16:53:07+05:30 IST