అదే జరిగితే దేశంలో ప్యాకేజ్‌డ్ ఫుడ్‌కు తీవ్ర కొరత తప్పదు: బ్రిటానియా హెచ్చరిక

ABN , First Publish Date - 2020-03-27T02:55:39+05:30 IST

దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో వారం పది రోజుల్లో ప్యాకేజ్‌డ్ ఫుడ్ (ప్యాకింగ్ చేసిన ఆహారం)కి

అదే జరిగితే దేశంలో ప్యాకేజ్‌డ్ ఫుడ్‌కు తీవ్ర కొరత తప్పదు: బ్రిటానియా  హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో వారం పది రోజుల్లో ప్యాకేజ్‌డ్ ఫుడ్ (ప్యాకింగ్ చేసిన ఆహారం)కి తీవ్రమైన కొరత ఏర్పడుతుందని ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఆవేదన వ్యక్తం చేసింది. 21 రోజుల లాక్‌డౌన్ మధ్య బిస్కెట్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరాలో నిరంతరం అవరోధాలు ఎదురవుతున్నాయని ఆ సంస్థ ఎండీ వరుణ్ బెర్రీ పేర్కొన్నారు. గిడ్డంగుల నుంచి ట్రక్కుల కదలిక, ఉత్పాదకతకు సంబంధించిన పనులన్నీ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ సమస్య ఇలాగే కొనసాగితే తీవ్ర కొరత ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్లు తెరవాలని, ఫుడ్ ప్రాసెసింగ్‌ను అత్యవసరాల జాబితాలో చేర్చాలని ఆయన కోరారు.  


ప్రస్తుతం, ఆహార పరిశ్రమ సరఫరా చైన్ వేరుచేయబడిందని, ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన ముడిపదార్థాల సరఫరా తగ్గిందని బెర్రీ అన్నారు. సరఫరా చైన్‌లో ఒక్క లింకు తెగినా మరో వారం నుంచి 10 రోజుల్లో దేశవ్యాప్తంగా ప్యాకేజ్‌డ్ ఫుడ్‌కు తీవ్రమైన కొరత ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఫ్యాక్టరీకి వచ్చి పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని కిందిస్తాయి అధికారులకు చెప్పడం ద్వారా ఆటంకాలు లేకుండా చూడాలని బెర్రీ కోరారు.

Updated Date - 2020-03-27T02:55:39+05:30 IST