బ్రిటన్‌ శ్రీమంతుల జాబితాలో రిషి సునాక్‌, అక్షతామూర్తి

ABN , First Publish Date - 2022-05-22T18:02:02+05:30 IST

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ శ్రీమంతుల జాబితాలో అక్కడి ఆర్థికమంత్రి, భారత్‌కు చెందిన రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతామూర్తి నిలిచారు. సండేటైమ్స్‌ సంస్థ ఈ ఏడాది జరిపిన సర్వేలో 250మంది

బ్రిటన్‌ శ్రీమంతుల జాబితాలో రిషి సునాక్‌, అక్షతామూర్తి

బెంగళూరు: యునైటెడ్‌ కింగ్‌డమ్‌ శ్రీమంతుల జాబితాలో అక్కడి ఆర్థికమంత్రి, భారత్‌కు చెందిన రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతామూర్తి నిలిచారు. సండేటైమ్స్‌ సంస్థ ఈ ఏడాది జరిపిన సర్వేలో 250మంది పేర్లు ప్రకటించగా దంపతులు 222 స్థానంలో ఉన్నారు. రిషి, అక్షితాల ఆస్తుల విలువ రూ.7074కోట్లుగా సండేటైమ్స్‌ ప్రకటించింది. గడిచిన 34ఏళ్ల నుంచి యూకే శ్రీమంతుల జాబితా విడుదల అవుతోంది. అయితే తొలిసారి రాజ కీయనేతలు అందులో అవకాశం పొందారు. అక్షతా తమ తల్లిదండ్రుల సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో 0.93 షేర్‌ను కలిగి ఉన్నట్టు గత ఏడాది ప్రకటించారు. తద్వారా జాబితాకు చేరారు. ఇన్ఫోసిస్‌లో రూ.6,684కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా ఇన్ఫోసిస్‌ ఐటీ దిగ్గజ ప్రధా న కార్యాలయం ఉంది. కాగా రాష్ట్రంలోనే మైసూరుతోపాటు దేశ విదేశాలలోనూ వారికి శాఖలు ఉన్నాయి. హిందూజా సంస్థ ముఖ్యులైన గోపి చంద్‌ హిందూజాతోపాటు వారి కుటుంబీకులు యూకే శ్రీమంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. వీరి ఆస్తి రూ.2.75లక్షలకోట్లుగా ఉంది. జాబితాలో మూడోస్థానంలో భారత్‌కు చెందిన డేవిడ్‌, సైమన్‌ రూబెన్‌లు ఉన్నారు. 250మంది శ్రీమంతుల జాబితాలో పదులసంఖ్యలో భారతీయులు చోటు దక్కించు కోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

Updated Date - 2022-05-22T18:02:02+05:30 IST