Abn logo
Sep 21 2021 @ 01:23AM

బ్రిటన్‌ది జాత్యహంకారమే : కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 : కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారినీ వ్యాక్సిన్‌ తీసుకోని వారిగానే పరిగణిస్తామంటూ బ్రిటన్‌ రూపొందించిన నిబంధనలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ‘అది ముమ్మాటికీ జాత్యహంకార చర్యే’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైరాం రమేశ్‌, శశి థరూర్‌ విమర్శించారు. ‘‘కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందే బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో! పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ డోసులను ఆ దేశం దిగుమతి చేసుకొని వాడుతోంది. అదే టీకా వేసుకున్న భారతీయులపై మాత్రం ఎందుకీ వివక్ష?’’ అని జైరాం రమేశ్‌ ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు.


‘‘కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్న భారతీయులను క్వారంటైన్‌లో ఉండాలనడంతో బ్రిటన్‌లో జరగాల్సిన నా కొత్త పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాలను విరమించుకున్నాను’’ అని శశి థరూర్‌ పేర్కొన్నారు.