లండన్: కోవిషీల్డ్ టీకా తీసుకున్నప్పటికీ క్వారంటైన్లో ఉండాల్సిందేనంటూ బ్రిటన్ పెట్టిన ఆంక్షలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో బ్రిటన్ ప్రభుత్వం మాట మార్చింది. తమకు టీకాపై నమ్మకముందని అయితే భారత్ ఇచ్చే టీకా ధ్రువపత్రాలపై తమకు అనుమానాలున్నాయని బ్రిటన్ బుధవారం పేర్కొంది. నిజానికి ఒక్క భారతీయులకు మాత్రమే ఈ నిబంధనలు పెట్టేలేదు. కోవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ బ్రిటన్కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరి క్వారంటైన్లో ఉండాలంటూ భారత్ సహా మరికొన్ని దేశాలపై ఆంక్షలు విధించారు. నిజానికి భారత్ ఇచ్చే టీకా ధ్రువపత్రాలపై అభ్యంతరాలుంటే ఇతర దేశాలకు ఆ నిబంధనలు ఎందుకు పెట్టారని విమర్శలు వస్తున్నాయి.
విషయం ఏంటంటే.. కోవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ బ్రిటన్కు వచ్చే భారతీయులు సహా మరికొన్ని దేశాల వారు క్వారంటైన్లో తప్పనిసరిగా ఉండాలంటూ ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధనాలు రూపొందించింది. అయితే భారత్లో తయారైన టీకాలను వినియోగించుకుంటున్న బ్రిటన్.. భారతీయులపై ఇలాంటి వివక్షాపూరిత విధానాలను మొపడం ఎంత మాత్రం సబబు కాదని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూకే తన విధానాల్ని మార్చుకోకపోతే ప్రతిచర్య తప్పదని కూడా హెచ్చరించింది.