సిడ్నీలో టీమిండియా క్వారంటైన్‌?

ABN , First Publish Date - 2020-10-22T08:57:41+05:30 IST

ఆస్ట్రేలియా పర్యటనకు సిడ్నీలో అడుగుపెట్టనున్న టీమిండియా అక్కడే స్వీయ నిర్బంధంలో ఉండడంతోపాటు సాధన కూడా చేయనున్నట్టు

సిడ్నీలో టీమిండియా క్వారంటైన్‌?

అక్కడే పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనకు సిడ్నీలో అడుగుపెట్టనున్న టీమిండియా అక్కడే స్వీయ నిర్బంధంలో ఉండడంతోపాటు సాధన కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ టూర్‌లో భాగంగా భారత జట్టు బ్రిస్బేన్‌ చేరుకొని అక్కడే క్వారంటైన్‌లో ఉండనున్నట్టు తొలుత వార్తలొచ్చాయి. కానీ 14 రోజుల స్వీయనిర్బంధంలో ప్రాక్టీస్‌ చేసేందుకు క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రం అంగీకరించలేదు. దాంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా సిడ్నీని ఎంపిక చేసినట్టు సమాచారం. అలాగే..మూడు టీ20లు, మూడు వన్డేల పరిమిత ఓవర్ల సిరీ్‌సలో కోహ్లీసేన నాలుగు మ్యాచ్‌లు సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆడనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన రెండు పోటీలకు కాన్‌బెర్రాలోని మనూకా ఓవల్‌ వేదిక కానున్నట్టు సమాచారం. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల క్వారంటైన్‌తోపాటు ప్రాక్టీ్‌సకు అనుమతివ్వాల్సిందిగా క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరినట్టు న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్ర క్రీడల మంత్రి స్టువర్ట్‌ ఐరెస్‌ బుధవారం ధ్రువీకరించారు. క్రికెట్‌ ఆస్ట్రేలియా, న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్ర ప్రభుత్వం ఓ అంగీకారానికొస్తే..భారత్‌ పర్యటనకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఆమోదం కోసం పంపనున్నారు.  

Updated Date - 2020-10-22T08:57:41+05:30 IST