వంకాయ కొత్తిమీర కారం కూర

కావలసిన పదార్థాలు: వంకాయలు లేతవి- ఎనిమిది, కొత్తిమీర- ఓ కట్ట, పచ్చిమిర్చి- 8, పసుపు- చిటికెడు, నూనె, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: వంకాయల్ని గుత్తులుగా కట్‌ చేసి ఉప్పు వేసిన నీళ్లలో వెయ్యాలి. కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి కలిపి మెత్తగా నూరుకోవాలి. వంకాయగుత్తుల్లో ఈ కొత్తిమీర కారం నిండుగా కూరి పక్కన పెట్టుకోవాలి. ఓ పాన్‌లో నూనెవేసి కాగాక ఒక్కో వంకాయని వేసి సన్నని సెగమీద మగ్గనివ్వాలి. ఈ కూర చల్లారితే చాలా రుచిగా ఉంటుంది.


థాయ్‌ గ్రీన్‌ కర్రీడుబ్కీ వాలే ఆలూషాహీ బిండీ క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తాహరియాలి పనీర్‌ టిక్కా మసాలా బేబీకార్న్‌ బటర్‌ మసాలాబెండీ ఫ్రైసోయాబీన్‌ కర్రీముల్లంగి వేపుడుఉసిరి కొబ్బరి కర్రీ
Advertisement
Advertisement