నిధులు తీసుకురండి

ABN , First Publish Date - 2022-05-21T07:13:58+05:30 IST

హెచ్చెల్సీ ఆధునికీకరణ, హంద్రీనీవా డిసి్ట్రబ్యూటరీల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కలిసికట్టుగా కృషి చేయాలని ఐఏబీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

నిధులు తీసుకురండి
మాట్లాడుతున్న జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఐఏబీ సమావేశంలో  సభ్యుల పట్టు

నివేదిక ఇస్తే.. సీఎం దృష్టికి తీసుకువెళతా

ఇనచార్జి మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 20: హెచ్చెల్సీ ఆధునికీకరణ, హంద్రీనీవా డిసి్ట్రబ్యూటరీల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కలిసికట్టుగా కృషి చేయాలని ఐఏబీ సభ్యులు  డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ రెవెన్యూ భవనలో కలెక్టర్‌ నాగలక్ష్మి అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం శుక్రవారం జరిగింది. సభ్యులంతా ఆరంభంలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేసేలా కృషి చేయాలని పట్టుబట్టారు. దీనికి ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు, తాగునీటికి అవసరమైన నిధులు, సమస్యలపై నివేదిస్తే సీఎం జగన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులలో నీటి లభ్యత బాగుందని, పంటలకు సకాలంలో నీటిని ఇచ్చి, విపత్తుల నుంచి రక్షణ కల్పించేందుకే ముందస్తుగానే ఐఏబీ సమావేశం నిర్వహించామని తెలిపారు. డ్రిప్‌ పరికరాలు, విద్యుత కోసం నిధులు కేటాయించామని తెలిపారు. 


ఎవరేమడిగారు..?

-  కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బోరంపల్లి, ఒంటిమిద్దె సమీపంలో శ్రీరాంరెడ్డి ప్రాజెక్ట్‌ తాగునీటి పైపులైన తరచూ పగిలిపోతోందని, సమస్యను పరిష్కరించాలని మంత్రి ఉష శ్రీచరణ్‌ కోరారు. బీటీపీకి హంద్రీనీవా నీటిని తరలించే నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. తన నియోజకవర్గంలోని అన్ని చెరువులను నీటితో నింపాలని కోరారు. 

-  హెచ్చెల్సీ ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి కోరారు. 

-  శ్రీశైలం డ్యాం నుంచి ఎన్ని ప్రాంతాలకు, ఎన్ని కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారో, ఎంత ప్రయోజనం కలుగుతోందో ప్రజలకు వివరించాలని శాసనమండలి విప్‌ వెన్నపూస గోపాల్‌రెడ్డి కోరారు. జిల్లాలో హంద్రీనీవా కింద 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న వివరాలను తెలియజేయాలని కోరారు. 

-  జిల్లాలోని అన్ని చెరువులను నింపాలని ఎంపీ రంగయ్య కోరారు. శ్రీసత్యసాయి, శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. చాగల్లు, జీడి పల్లి రిజర్వాయర్ల ముంపు బాధితులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. 

-  హంద్రీనీవా నీటితో చెరువులన్నీ నింపాలని, సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కోరారు. రాగులపాడు వద్ద భూసేకరణ పూర్తి చేసి, నిర్మాణం పూర్తి చేయాలని, ప్రాజెక్ట్‌ల పూర్తికి నిధులు రాబట్టుకోవాలని అన్నారు. 

-  హెచ్చెల్సీ ఆధునికీకరణ, సమాంతర కాలవ నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి సూచించారు. ఇనచార్జి మంత్రి, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం దృష్టికి డీపీఆర్‌ను తీసుకెళ్తామని తెలిపారు. హంద్రీనీవా కింద డిసి్ట్రబ్యూటరీల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ఇటీవల తాగునీటి కోసం కక్కలపల్లి పంచాయతీలో మహిళలు బిందెలతో చేసిన ధర్నా, సమస్య తీవ్రతను తెలుపుతోందని అన్నారు. డబ్బులు ఖర్చు చేయకుండా చెరువులకు, గ్రామాల ప్రజలకు నీరందించే నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. 

-  గుంతకల్లు నియోజకవర్గంలో నీటి తీరువా ఒకరు కడితే, నీరు మరొకరు వాడుకుంటున్నారని గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి అన్నారు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. హెచ్చెల్సీ, హంద్రీనీవా నీటితో చెరువులన్నీ నింపాలని కోరారు. అక్రమ నీటి వాడకం, చౌర్యాన్ని నియంత్రించాలని అన్నారు. 

-  అనంతసాగరానికి నీరు అడిగింది, తెచ్చింది తానైతే, జలవనరుల శాఖ అధికారులు అనంతపురం ఎమ్మెల్యే పేరు చెప్పడం ఏమిటని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని వక్రీకరించడం మంచిదికాదని అన్నారు. శింగనమల చెరువును లోకలైజేషన చేయాలని, ఎంపీఆర్‌ సౌత కెనాల్‌ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. 

- యాడికి కాలువ నిర్మాణం అసంపూర్తిగా ఉందని, దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. 42, 32 ప్యాకేజీల్లో భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని కోరారు. 

ఫ ఖరీఫ్‌ సీజనలో నీటి విడుదల కోసం ముందుగానే ఐఏబీ సమావేశం నిర్వహిస్తున్నా మని, సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని ఆర్‌బీకేల స్థాయిలో రైతుల వద్దకు తీసుకెళ్తామని కలెక్టర్‌ నాగలక్ష్మి అన్నారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ, జేసీ కేతన గార్గ్‌, నగరపాలక సంస్థ మేయర్‌ వసీం, ఏడీసీసీబీ చైర్‌పర్సన లిఖిత, ఇనచార్జి డీఆర్‌డీఓ శ్రీనివాసులు, హెచ్చెల్సీ ఎస్‌ఈ, ఐఏబీ కన్వీనర్‌ రాజశేఖర్‌, హంద్రీనీవా ఎస్‌ఈ దేశేనాయక్‌, మైనర్‌ ఇరిగేషన ఎస్‌ఈ సుధాకర్‌, జేడీఏ చంద్రానాయక్‌, సీపీఓ ప్రేమచంద్ర, ఉద్యానశాఖ డీడీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T07:13:58+05:30 IST