వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించండి

ABN , First Publish Date - 2022-09-26T06:50:46+05:30 IST

: వైసీపీ ప్రభు త్వాన్ని గద్దెదించే సమయం అసన్నమైందని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారా యణరెడ్డి అన్నారు. మండలంలోని తువ్వపాడు గ్రామంలో ఆదివారం టీడీపీ మండల అధ్య క్షుడు మోరబోయిన బాబురావు అధ్యక్షతన బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహించారు.

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించండి

మాజీ ఎమ్మెల్యే  నారాయణరెడ్డి

కొనకనమిట్ల, సెప్టెంబరు 25 : వైసీపీ ప్రభు త్వాన్ని గద్దెదించే సమయం అసన్నమైందని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారా యణరెడ్డి అన్నారు. మండలంలోని తువ్వపాడు గ్రామంలో ఆదివారం టీడీపీ మండల అధ్య క్షుడు మోరబోయిన బాబురావు అధ్యక్షతన బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్ప డుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. వైసీపీ నాయకుల మోసాలు ప్రజలు క్షణ్ణంగా గమని స్తున్నారన్నారు. ప్రజలను వంచించే ఇలాంటి నాయకులను గ్రామాల్లో ప్రజలు తరిమి కొట్టాలన్నారు. డీబీటీ పేరుతో నగదు బదిలి చేసి ఇసుక వద్ద నుంచి మద్యం, నిత్యవసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కరెంట్‌, బస్‌ చార్జీలు తదితర వాటిపై అధిక పన్నులు వేసి మధ్యతరగతి, పేదవాడి నడ్డి విరుస్తున్నార న్నా రు. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కప్పిపుచ్చి వైసీపీ నాయకులు ప్రజలను నగదు బదిలీతో బురిడి కొట్టిస్తున్నారన్నారు. ప్రస్తుతం జగన్‌రెడ్డి చేస్తున్న పాలనను ఒక్కసారి గమ నించాలని ప్రజలను కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మేజారిటీ తో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.  రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే తిరిగి చంద్రబాబు నాయుడుని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తొలుత తువ్వపాడు గ్రామంలో నారాయణరెడ్డికి టీడీపీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మోరబోయిన బాబురావు, పొదిలి మార్కెట్‌ యార్డు మాజీ అధ్యక్షులు చప్పిడి రామ లింగయ్య, రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి సాని కొమ్ము రామిరెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వరికూటి వెంకటరామిరెడ్డి, కనకం నరసింహారావు, ఏదుబాటి వెంకట నారాయణ చౌదరి, మువ్వా కాటంరాజు, శ్రీకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్‌,  జిల్లా కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వరెడ్డి, మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు రసూల్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్య దర్శి వరికుంట్ల అనీల్‌, పొదిలి మాజీ సర్పంచ్‌ కాటూరి పెదబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాటూరి శ్రీను,  గ్రామ టీడీపీ నాయకులు కార్య కర్తలు  పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T06:50:46+05:30 IST