మోయలేని పుస్తకం!

ABN , First Publish Date - 2020-02-17T06:37:25+05:30 IST

రోజూ స్కూల్‌కు పుస్తకాల బ్యాగ్‌ను తీసుకెళుతుంటారు కదా! పది, పదిహేను పుస్తకాలున్నా మోసుకెళ్లిపోతుంటారు. అయితే హంగేరీలోని..

మోయలేని పుస్తకం!

రోజూ స్కూల్‌కు పుస్తకాల బ్యాగ్‌ను తీసుకెళుతుంటారు కదా! పది, పదిహేను పుస్తకాలున్నా మోసుకెళ్లిపోతుంటారు. అయితే హంగేరీలోని ఓ చిన్నగ్రామంలో ఉన్న ఒక పుస్తకాన్ని మాత్రం ఎవ్వరూ మోయలేరు? ఎందుకో తెలుసా? ఆ పుస్తకం బరువు 1,420 కేజీలు. అవును! మీరు చదివింది నిజమే. 346 పేజీలున్న ఈ పుస్తకాన్ని యంత్రంపై కాకుండా చేత్తో తయారుచేశారు. దీనికి ప్రపంచంలోనే చేత్తో తయారుచేసిన అతిపెద్ద పుస్తకంగా గుర్తింపు ఉంది. హంగేరీలోని సిన్‌పెట్రీ అనే చిన్న గ్రామంలో ఉందీ పుస్తకం. కాగితం తయారీదారులైన బెలా వర్గా, గాబర్‌ వర్గా అనే ఇద్దరు వ్యక్తులు ఈ పుస్తకాన్ని తయారుచేశారు. ఆ పుస్తకాన్ని స్థానికంగా ఉన్న పేపర్‌ మిల్లులో సందర్శకుల కోసం ప్రదర్శనకు ఉంచారు. ఇంతకీ... అతిపెద్ద పుస్తకంగా గుర్తింపు పొందిన ఈ బుక్‌లో ఏముందో తెలుసా? స్థానికంగా పెరిగే వృక్షాలు, జంతువుల సమాచారాన్ని ఇందులో బొమ్మలతో సహా పొందుపరిచారు.

Updated Date - 2020-02-17T06:37:25+05:30 IST