బృహత్‌ పల్లె ప్రకృతి వనంతో పచ్చదనం

ABN , First Publish Date - 2022-07-02T05:06:41+05:30 IST

బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో పచ్చదనం ఏర్పడుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు

బృహత్‌ పల్లె ప్రకృతి వనంతో పచ్చదనం

 తూప్రాన్‌ (మనోహరాబాద్‌), జూలై 1: బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో పచ్చదనం ఏర్పడుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. శుక్రవారం మనోహరాబాద్‌ మండలం గౌతోజిగూడలో బృహత్‌ పల్లె ప్రకృతివనం పనులను ఆమె ప్రారంభించారు. అటవీశాఖకు చెందిన సర్వేనంబరు 391లోని ఐదెకారల్లో బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు పనులను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీతరవి, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీవో లక్ష్మీనర్సింహులు, ఏపీవో ఆదినారాయణ, సర్పంచ్‌ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచు రేణుకుమార్‌, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ మమతారెడ్డి, కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే, కృషి విజ్ఞాన కేంద్రం ప్రతినిధి రవికుమార్‌, జడ్పీచైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌తో కలిసి ఎస్సీ రైతులకు ఉచితంగా వరి విత్తనాలను అందజేశారు.


 

Updated Date - 2022-07-02T05:06:41+05:30 IST