మెరిసిన ఇందూరు బిడ్డ

ABN , First Publish Date - 2022-08-08T08:05:55+05:30 IST

అంతర్జాతీయ క్రీడల్లో ఇందురూ క్రీడాకారిణి మరోసారి తన సత్తా చాటింది. కొన్ని నెలల క్రితం ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ పోటీల్లో నిఖత్‌ జరీన్‌ ఛాంపియన్‌గా నిలువగా.. కామన్వెల్త్‌ క్రీడల్లోనూ తన ప్రతిభను చాటి స్వర్ణ పతకం సాధించి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది.

మెరిసిన ఇందూరు బిడ్డ

 కామన్వెల్త్‌  క్రీడల్లో స్వర్ణం సాధించిన జిల్లాకు చెందిన నిఖత్‌ జరీన్‌

సుభాష్‌నగర్‌, ఆగస్టు 7: అంతర్జాతీయ క్రీడల్లో ఇందురూ క్రీడాకారిణి మరోసారి తన సత్తా చాటింది. కొన్ని నెలల క్రితం ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ పోటీల్లో నిఖత్‌ జరీన్‌ ఛాంపియన్‌గా నిలువగా.. కామన్వెల్త్‌  క్రీడల్లోనూ తన ప్రతిభను చాటి స్వర్ణ పతకం సాధించి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది. కామన్వెల్త్‌  క్రీడలో  మొదటి నుంచి ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తూ విజయ పరంపరను కొనసాగించింది. 52 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌లో పోటీపడ్డ నిఖత్‌ జరీన్‌ రెండు కేజీలు తగ్గి కామన్వెల్త్‌  క్రీడల్లో 50 కేజీల విభాగంలో పోటీ పడింది. సెమీస్‌లో ఘనాకు చెందిన బాక్సర్‌ను అలవోకగా గెలిచి ఫైనల్‌కు చెరిన నిఖత్‌ ఆదివారం జరిన ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కార్లీ మెక్‌నాల్‌ను చిత్తుచేసి కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతాకాన్ని అందుకుంది. జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌కు చెందిన నిఖత్‌ తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి నిఖత్‌కు చదువుతో పాటు ఆటలు నేర్చుకునేలా ప్రోత్సహించారు. మొదటి కోచ్‌ సంశొద్దీన్‌ వద్ద  ఓనమాలు నేర్చుకున్న నిఖత్‌ చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. కాగా, కామన్వెల్త్‌  క్రీడల్లో ఛాంపియన్‌గా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవితతోపాటు జిల్లా క్రీడాభిమానులు హర్హం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-08T08:05:55+05:30 IST