వంతెనలు కట్టరు.. కష్టాలు తీరవు

ABN , First Publish Date - 2022-08-05T04:20:22+05:30 IST

జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో అనుభవాల్లోకి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా 488గ్రామాలకు కనీసం మట్టి రోడ్డు కూడా లేని పరిస్థితి ఉంది. ఇందులో ఏజేన్సీ ప్రాంతంలోని 21గ్రామ పంచాయతీల పరిధిలో 115ఆవాసాలకు వర్షాలు వచ్చాయంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు కొల్పోతున్నాయి. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గడిచిన 50ఏళ్లలో కనీసం చిన్నచిన్న కల్వర్టులు నిర్మించలేని పరిస్థితి నెలకొన్నాయి. చిన్నపాటి వర్షాలకే, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

వంతెనలు కట్టరు.. కష్టాలు తీరవు
చింతలమానేపల్లి మండలం దిందా వాగుపై వంతెన లేక నాటు పడవలను ఆశ్రయిస్తున్న ప్రజలు

- వరదొస్తే ఊర్లకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్‌

- రోగం వస్తే దేవుడిపై భారం

- చిన్నవర్షాలకే ఉప్పొంగుతున్న వాగులు 

- కష్టాలు తీరాలంటే రూ.529 కోట్లు కావాల్సిందే

- జిల్లాలో వాగులపై 21వంతెనలు, 115 చిన్న వంతెనలు అవసరం

- బాహ్యప్రపంచతో సంబంధాలు కోల్పోతున్న ఆవాసాలు 115

ఆసిఫాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో అనుభవాల్లోకి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా 488గ్రామాలకు కనీసం మట్టి రోడ్డు కూడా లేని పరిస్థితి ఉంది. ఇందులో ఏజేన్సీ ప్రాంతంలోని 21గ్రామ పంచాయతీల పరిధిలో 115ఆవాసాలకు వర్షాలు వచ్చాయంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు కొల్పోతున్నాయి. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గడిచిన 50ఏళ్లలో కనీసం చిన్నచిన్న కల్వర్టులు నిర్మించలేని పరిస్థితి నెలకొన్నాయి. చిన్నపాటి వర్షాలకే, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు ఈ వాగులను దాటే క్రమంలో ప్రమాదాలకు గురై జలసమాధి అవుతున్న సందర్భం కూడా షరా మాములు గానే ఉంది. ప్రతి ఏటా వర్షాకాలంలో నివేదికలు, క్షేత్రస్థాయి పర్యటనలో పేరుతో హడావుడి చేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆ తర్వాత ప్రజల సమస్యను గాలికి వదిలేస్తుండటంతో ఏజేన్సీల్లోని గ్రామాలకు దుర్భర పరిస్థితులు తప్పటం లేదు. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు ఐదుగురు వ్యక్తులు వరదల్లో కొట్టుకపోయి అసువులు బాయటం జిల్లాలో ఉన్న దయనీయ పరిస్థితులకు అద్ధం పడుతుందని చెప్పాలి. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో అత్యవసరంగా 21గ్రామాలకు పెద్ద వంతెనలు, 115ఆవాసాలకు చిన్నచిన్న కల్వర్టులు నిర్మిస్తే కొంతలో కొంతైనా ఉపశమనం లభిస్తుందని అధికారుల వాదన. ఇదిలా ఉంటే జిల్లాలో ప్రతి ఏటా జూలై నుంచి డిసెంబరు మధ్య కురిసే వర్షాలకు వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా తాత్కాలికంగా చేపట్టే నిర్మాలన్నీ కూడా ఏయేటికాయేడు వరదలకు తుడిచి పెట్టుకపోతున్న పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించాలని శాశ్వత ప్రతిపాదికపై పెద్ద చిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంటుందని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ప్రాథమికంగా వేసిన అంచనాల ప్రకారమే వంతెనల నిర్మాణానికి రూ.106కోట్లు అవసరం అవుతాయని తేల్చారు. 

మౌలిక సదుపాయాల కోసం రూ.529 కోట్లు అవసరం..

ఆసిఫాబాద్‌ జిల్లాలో 335గ్రామ పంచాయతీల పరిఽధి 115ఆవాసాలకు కనీస రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి ఉంది. మరో 385 ఆవాసాలకు మట్టిరోడ్లే పెద్దదిక్కు. ఇవన్నీ వర్షాకాలంలో బురదమయంగా మారి రాకపోకలకు సమస్యలు సృష్టిస్తున్నాయి. అధికారులు తాజాగా వేసిన అంచనాల ప్రకారం జిల్లాలో రోడ్ల అభివృద్ధి, చిన్నా, పెద్ద వంతెనలు, కల్వర్టులు ఇతరత్రా వాటికి రూ.529 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందులో వంతెనల నిర్మాణానికి రూ.106కోట్లు అవసరం అవుతాయని తేల్చగా 121కిలోమీటర్ల మట్టిరోడ్లను అభివృద్ధి చేయటం కోసం రూ.72కోట్లు(బీటీ) అవసరం అవుతాయని అంచనా వేశారు. మొత్తం 550 కిలోమీటర్ల ఆవాసాల్లో రోడ్డు నిర్మాణానికి రూ.351కోట్లు అవసరమని తేల్చారు. అయితే 2019నుంచి ఇందుకు సంబంధించి ప్రభుత్వ నివేదికలు కోరటం, అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేసి పంపించటం రివాజుగా మారిందే తప్పా అనుకున్న స్థాయిలో నిధులు మంజూరు కావటం లేదన్నది ప్రజాప్రతినిధుల అభిప్రాయం. అధికారులు కూడా ఇంచుమించు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

Updated Date - 2022-08-05T04:20:22+05:30 IST