భయపెడుతున్న బ్రిడ్జిలు !

ABN , First Publish Date - 2021-05-12T06:12:28+05:30 IST

ఒంగోలు మండలంలో ని కొప్పోలు-కరవది రోడ్డులో ప్రయాణం ప్రమాదకర ంగా మారింది. ఈ మార్గంలో పోతురాజు కాలువపైన, డంపింగ్‌ యార్డు వద్ద సాగర్‌ కాలువపై ఉన్న బ్రిడ్జిల సైడు గోడలు పడిపోవడంతో వాహన చోదకులు భయ పడుతున్నారు.

భయపెడుతున్న బ్రిడ్జిలు !
కరవది సాగర్‌ కాలువ వంతెనకు పడిపోయిన గోడలు

పడిపోయిన రక్షణ గోడలు

కొప్పోలు-కరవది రోడ్డులో ప్రయాణం ప్రమాదకరం


ఒంగోలు (రూరల్‌), మే 11 : ఒంగోలు మండలంలో ని కొప్పోలు-కరవది రోడ్డులో ప్రయాణం ప్రమాదకర ంగా మారింది. ఈ మార్గంలో పోతురాజు కాలువపైన, డంపింగ్‌ యార్డు వద్ద సాగర్‌ కాలువపై ఉన్న బ్రిడ్జిల సైడు గోడలు పడిపోవడంతో వాహన చోదకులు భయ పడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తు న్నారు. ఒంగోలు నుంచి చెత్త, ఇతర వ్యర్థాలను లారీలు, ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌ యార్డుకు ఈ రోడ్డు నుంచే తరలిస్తుంటారు. ప్రతిరోజూ కనీసం 40వాహనాలకు పైనే తిరుగుతుంటాయి. కొత్తపట్నం మండలం గాదెపాలెం, బీరంగుంట, ఆలూరు గ్రామాల ప్రజలు వాహనాల ద్వారా ఈ వంతనెలపై నుం చే రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా ఒ ంగోలు మండలంలోని కరవది, ఉలిచి, చేజర్ల, గుం డాయపాలెం, దేవరంపాడు, దేవరంపాడు ( హెచ్‌డబ్ల్యూ), పాతపాడు గ్రామాల ప్రజలు  ఇదే రోడ్డు నుంచి ఒంగోలు వెళ్తుంటారు. లారీ లు, ట్రాక్టర్లు కూడా తిరుగుతుంటాయి. దీంతో ఆ బ్రిడ్జిల వద్ద ఏసమయంలో ఏ ప్ర మాదం జరుగుతుందోనని, ప్రజలు భయపడిపోతున్నారు. అధికారులు స్పందించి సై డు గోడలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 


Updated Date - 2021-05-12T06:12:28+05:30 IST