సేతు బంధ సర్వాంగాసనం

ABN , First Publish Date - 2020-06-21T05:30:00+05:30 IST

ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇప్పటికే మీరు కొన్ని యోగాసనాల గురించి తెలుసుకున్నారు. రోజూ ఆ యోగాసనాలు సాధన చేస్తుంటే ఫరవాలేదు. ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి తప్పకుండా మొదలుపెట్టండి...

సేతు బంధ సర్వాంగాసనం

ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇప్పటికే మీరు కొన్ని యోగాసనాల గురించి తెలుసుకున్నారు. రోజూ ఆ యోగాసనాలు సాధన చేస్తుంటే ఫరవాలేదు. ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి తప్పకుండా మొదలుపెట్టండి. ఇప్పుడు సేతు బంధ సర్వాంగాసనం(బ్రిడ్జ్‌ పోస్‌) గురించి తెలుసుకుందాం!


  1. నేలపై వెల్లకిలా పడుకోవాలి.
  2. మోకాళ్లను వంచాలి. పాదాలు నేలపై ఆనించాలి. చేతులు రిలాక్స్‌డ్‌గా నేలను ఆనుకొని ఉండాలి.
  3. ఇప్పుడు గట్టిగా శ్వాస పీల్చి వీపు భాగాన్ని పైకి లేపాలి. శరీర బరువు మొత్తం పాదాలు, భుజాలపై ఉండాలి.
  4. చేతులు రెండింటిని ఒకదానితో ఒకటి పట్టుకోవాలి. ఎంతసేపు వీలైతే అంత సేపు ఈ భంగిమలో ఉండాలి. శ్వాసను నెమ్మదిగా వదలడం, తీసుకోవడం చేస్తుండాలి. 
  5. తరువాత నెమ్మదిగా సాధారణ స్థితిలోకి రావాలి. ఈ ఆసనం వల్ల వెన్నెముక బలోపేతం అవుతుంది. శ్వాసకోశాల పనితీరు పెరుగుతుంది.

Updated Date - 2020-06-21T05:30:00+05:30 IST