శివపురం – చిన్నంపేట వంతెనకు గండి

ABN , First Publish Date - 2021-07-25T05:26:36+05:30 IST

తమ్మిలేరు ఎగువ భాగం నుంచి వరద నీరు రావడ ంతో శివాపురం – చిన్నం పేట మధ్య వంతెన పక్కన గండి పడడంతో రెండు గ్రా మాలకు రాకపోకలు నిలిచి పోయాయి.

శివపురం – చిన్నంపేట వంతెనకు గండి
శివాపురం వద్ద తమ్మిలేరు వాగుపై చప్టాకు గండిపడిన దృశ్యం

చింతలపూడి, జూలై 24 : తమ్మిలేరు ఎగువ భాగం నుంచి వరద నీరు రావడ ంతో శివాపురం – చిన్నం పేట మధ్య వంతెన పక్కన గండి పడడంతో రెండు గ్రా మాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ఈ వంతెనకు గతంలోనే తరచు గండి పడుతుండడం వల్ల మరో రెండు కానాలు పెంచి వంతెనకు ఇరువైపులా రైలింగ్‌ నిర్మించి ఇటు కృష్ణా, అటు పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాల ప్రజలకు రహదారి, రవాణా సౌకర్యం కల్పించాలని గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఏలూరు పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు తెలిపారు. 


Updated Date - 2021-07-25T05:26:36+05:30 IST