కొందరు యువకులు సినిమాలు చూసి.. నిజ జీవితంలోనూ తాము హీరోలనే భ్రమలో ఉంటారు. కొన్నిసార్లు హీరోలు చేసినట్లుగానే నిజంగా చేసి.. నలుగురి చేతిలో దెబ్బలు తినడమో.. నవ్వులపాలవడమో జరుగుతూ ఉంటుంది. ఇక ప్రేమ విషయంలో యువతీయువకుల చేష్టలు హద్దులు దాటిపోతుంటాయి. ఎలాగైనా తమ ప్రేమను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారో.. వారికే తెలీనంతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. తమ పైశాచికాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ యువకుడు ఏకంగా పెళ్లిమండపంలోకి వెళ్లి, వధువు తన ప్రియురాలని.. ఏకంగా వరుడి ముందే చెప్పేస్తాడు...
ఇన్స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో కళ్యాణ వేదికపై వధూవరులు ఇద్దరూ దండలు మార్చుకుంటూ ఉంటారు. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి ఎంటర్ అవుతాడు. ఒక్కసారిగా వధువు వైపు చేయి చూపిస్తూ.. ‘‘తను నేను ప్రేమించిన అమ్మాయి’’.. అంటూ వరుడికే చెప్పేస్తాడు. అంతటితో ఆగకుండా ‘‘ సమాజానికి భయపడకు.. మన ప్రేమ గురించి అందరికీ చెప్పు’’.. అంటూ వధువుకు ధైర్యం చెబుతాడు. ఆ యువకుడి మాటలకు అవాక్కయిన వరుడు.. అలాగే నిలబడి, అమాయకంగా చూస్తూ ఉంటాడు. ‘‘అసలు నవ్వు ఎవరో నాకు తెలీదే.. నిన్ను ఎప్పుడూ చూడలేదు.. వెళ్లు ఇక్కడి నుంచి’’.. అని వధువు చెప్పడంతో యువకుడు షాక్ అవుతాడు. ఈ ఘటనను మొత్తం అక్కడున్నవారు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదుగానీ.. నెటిజన్లను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇవి కూడా చదవండి