అత్తారింటికి కొత్త పెళ్లికొడుకు.. పిల్లాడు చేసిన పనికి.. 4 కిలోమీటర్లు పరిగెత్తిన కుటుంబం

ABN , First Publish Date - 2021-07-21T22:50:47+05:30 IST

కొత్తగా పెళ్లిచేసుకున్నాడతను. అత్తారింటికి వచ్చాడు. అక్కడ తోరణాలు కట్టి అల్లుడిని ఆహ్వానించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుర్రంపై వరుడిని కూర్చోబెట్టారు. డీజే మోగుతోంది.

అత్తారింటికి కొత్త పెళ్లికొడుకు.. పిల్లాడు చేసిన పనికి.. 4 కిలోమీటర్లు పరిగెత్తిన కుటుంబం

ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా పెళ్లిచేసుకున్నాడతను. అత్తారింటికి వచ్చాడు. అక్కడ తోరణాలు కట్టి అల్లుడిని ఆహ్వానించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుర్రంపై వరుడిని కూర్చోబెట్టారు. డీజే మోగుతోంది. డ్యాన్సులు ప్రారంభం అవుబోతున్నాయి. గుర్రం చేత కూడా ఆడించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలో ఒక పిల్లాడు చేసిన పనికి అందరూ షాకైపోయారు. ఎందుకంటే.. ఆ పిల్లాడు చేసిన పనికి బెదిరిన గుర్రం ఒక్క ఉదుటున పక్కకు తిరిగి పరుగందుకుంది. ఆ గుర్రం వెనుక 4 కిలోమీటర్లు పరిగెత్తి ఎట్టకేలకు దాన్ని పట్టుకున్నారు. దీంతో ఆ పెళ్లికొడుకు మంచాన పడ్డాడు.


ఈ ఘటన మూడ్రోజుల క్రితం అజ్మీర్‌ జిల్లాలో జరిగిందట. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పిల్లాడు ఏం చేశాడో తెలుసా? ఉన్నట్లుండి బాణాసంచా పేల్చాడు. సడెన్‌గా పేలుడు జరగడం, చెవులు గింగిర్లేత్తేలా శబ్దం రావడంతో ఆ గుర్రం బెదిరిపోయింది. అంతే.. పక్కకు తిరిగి పరుగో పరుగు. దాన్ని నియంత్రించడం కుదరక ఆ పెళ్లికొడుకు కూడా అరవడం ప్రారంభించాడు. ఆ గుర్రం వెనుక పరిగెత్తిన బంధుమిత్రులు.. నాలుగు కిలోమీటర్లు వెంబడించి, చివరకు ఆ గుర్రాన్ని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆ కొత్త అల్లుడి ఆరోగ్యం దెబ్బతిన్నట్లు సమాచారం.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2021-07-21T22:50:47+05:30 IST