Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లికి కొద్ది క్షణాల ముందు.. వాంతి చేసుకున్న వధువు.. పెళ్లికొడుకు షాక్..!

ఇంటర్నెట్ డెస్క్: మరి కొద్ది సేపట్లో వారి పెళ్లి అనగా వధువు వరుడి దగ్గరికి వచ్చింది. నాకు ఒంట్లో ఎదో నలతగా ఉందని చెప్పింది. ఎదో చిన్న నలతే అయ్యుంటుందని అతడు ఆమె చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఫలితంగా.. అతడికి దిమ్మతిరిగే ఘటన జరిగింది. మరి కొద్ది క్షణాల్లో వారి పెళ్లనగా.. వరుడి దగ్గరగా వచ్చిన వధువు ఒక్కసారిగా స్పృహతప్పి అతడిపై పడిపోయింది. ఆ వేంటనే అతడిపై పెద్ద వాంతి చేసుకుంది. విషయం అక్కడితో అయిపోలేదు! ఓవైపు.. ఆమె పరిస్థితి ఇలా ఉంటే.. మూడేళ్ల వయసున్న ఆమె మేనల్లుడు ఆమై డ్రెస్సుపై మూత్రవిసర్జన చేశాడు. దీంతో.. ఆ పెళ్లి వేదిక  అంతా రచ్చ రచ్చ అయ్యింది. అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రానికి చెందిన హలీ, కొలెండా డార్నెట్ వివాహంలో ఇటీవల జరిగిన ఘటన ఇది. ఆ తరువాత వారి పెళ్లి జరిగి పోయినప్పటికీ.. ఈ సరదా ఘటనలకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

తనకు ఒంట్లో నలతగా ఉందన్న విషయం భర్తకు చెప్పానని హాలీ మీడియాకు తెలిపింది. ‘‘నాకు ఒంట్లో బాగాలేదని భర్తకు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నా..కానీ.. అతడు నేను జోక్ చేస్తున్నానని అనుకున్నాడు. కానీ.. వివాహం జరిగే సమయంలో పరిస్థితి ఒక్కసారిగా చేయిదాటింది. నాకు అకస్మాత్తుగా కళ్లుతిరగడంతో అతడిపై పడిపోయా. ఆ తరువాత వాంతి చేసుకున్నా.. ఇది చాలదన్నట్టు.. నా సొదరి కొడుకు నాపైనే మూత్ర విసర్జన చేశారు. దీంతో నా పెళ్లి డ్రస్సంతా పాడైపోయింది. ఇప్పుడిదంతా తలుచుకుంటే సరదాగా నవ్వు తెప్పిస్తున్నప్పటికీ అప్పుడు మాత్రం నా పరిస్థితి తలకిందులైంది’’ అని ఆమె చెప్పింది. 

తనకు లో బీపీ కూడా ఉందని హాలీ పేర్కొంది. దీనికి తోడు వివాహం జరిగే రోజున ఒత్తిడికి లోనవడం, మంచి నీళ్లు తాగకపోవడం వంటి కారణాల రీత్యా తీవ్ర డీహైడ్రేషన్‌కు లోనై ఆమె మూర్ఛపోయిందట. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజున పరిస్థితి ఇలా తలకిందులైనప్పటికీ.. భవిష్యత్తులో ఈ ఘటనలే తీపి గుర్తులుగా మారిపోతాయని, తన మనవలు, మనవరాళ్లకు చెప్పుకునేందుకు ఇదో సరదా ఘటన అయిపోతుందని హాలీ ముక్తాయించింది. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement