కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య.. ఏమైంది!?

ABN , First Publish Date - 2020-02-18T15:43:06+05:30 IST

పెళ్ళయిన పదహారు రోజులకే నవ వధువు ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య.. ఏమైంది!?

చెన్నై: తిరుప్పూరు జిల్లా ఉడుమలైపేటలో పెళ్ళయిన పదహారు రోజులకే నవ వధువు ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పై ఆర్డీవో విచారణ జరుపుతున్నారు. ఉడు మలైపే విలామరత్తుపట్టికి చెందిన షణ్ముగ వేల్‌, జీవరత్నం దంపతుల కుమారుడు రఘుపతి (32) విండ్‌ మిల్లులో పనిచేస్తు న్నాడు. జనవరి 30న రఘుపతికి పొల్లాచ్చి సమీపం జమీన్‌ఊత్తుకుళికి చెందిన రామసామి అనే కొబ్బరి వ్యాపారి కుమార్తె దీప (18)తో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత దీప భర్తతోపాటు విలామరత్తుపట్టి అత్తవారింట కాపురానికి వెళ్ళింది. ఇదిలా ఉండగా దీప ఉన్నట్టుండి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుందని రఘుపతి ఆమె తల్లి దండ్రులకు  కబురు చేశాడు. హుటాహుటిన అక్కడికి వెళ్ళిన దీప తల్లిదండ్రులు తమ కుమార్తె ఉరిపోసుకుని శవంగా వేలాడుతుండ టం చూసి దిగ్ర్భాంతి చెం దారు. సమా చారం అం దుకుని పోలీసులు హుటా హుటిన అక్కడికి చేరుకుని దీప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉడుమలై పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం పోస్టుమార్టం తర్వాత దీప మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.


ఆత్మహత్య కాదు..

ఇదిలా ఉండగా, దీప ఉరిపోసుకుని ఆత్మ హత్య చేసుకోలేదని ఆమె తండ్రి రామసామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తింట్లో దీప ఉరిపోసుకున్నప్పటికీ ఆమె పాదాలు నేలకు ఆనుకుని ఉండటాన్ని చూశామని, దీంతో కుమార్తె మృతిపై అనుమానం కలుగుతోందన్నారు. తాను కొబ్బరి వ్యాపారం చేస్తున్నా నని, తనకు ముగ్గురు కుమార్తె లని, పెద్ద కుమార్తె 12వ తర గతి వరకు చదువుకుం దని, ఆమె ఫొటోను చూసి రఘు పతి, అతడి తల్లి పెళ్ళి చూపు లకు వచ్చారని తెలిపారు. పెళ్ళి చూపుల రోజు దీప వివాహం చేసేంత డబ్బు తన వద్ద లేవ ని, ఆరేడు మాసాల తర్వాత పెళ్ళి చేస్తానని రఘుపతి కుటుంబీకులకు తెలిపానని రామసామి పేర్కొన్నారు. అయితే రఘుపతి, అతడి తల్లి అమ్మాయిని ఇస్తే చాలు పెళ్ళి ఖర్చులన్నింటినీ తామే భరి స్తామన్నారని, ఆ తర్వాతే అనుకున్న ప్రకారం పెళ్ళి జరిగిందన్నారు.


పెళ్ళి సందర్భంగా దీపకు అత్తింటి వారే నగలు కొనిచ్చారని తెలిపారు. దీప ఆత్మహత్య చేసుకోవ డానికి ముందు ఫోన్‌ చేసి తనతో మాట్లాడిందని, తాను సంతోషం గానే ఉన్నట్లు కూడా తెలిపిందన్నారు. ఆ తర్వాత సాయంత్రాని కల్లా ఆమె ఉరిపోసు కుని ఆత్మహత్య చేసుకు న్నట్లు తనకు కబురొచ్చిందన్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిపంద కాదని రామసామి తెలిపారు. దీప మృతిలో అనుమానాలున్నా యని తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. కనీసం ఆర్డీవో విచారణలోనైనా వాస్తవాలు వెలువడుతుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో దీప మృతిపై సోమవారం   దీప భర్త రఘపతిని ఆర్డీఓ విచారించారు.

Updated Date - 2020-02-18T15:43:06+05:30 IST