Abn logo
Jun 23 2021 @ 06:58AM

న‌ల్ల క‌ళ్ల‌ద్దాల వ‌రుడికి రీడింగ్ టెస్ట్‌... చివ‌రికి ఇలాంటోడు వ‌ద్ద‌న్న‌ వ‌ధువు!

ల‌క్నో:  యూపీలోని ఔర‌య ప‌రిధిలోని ఒక గ్రామంలో జ‌రిగిన పెళ్లి వేడుకలో వరుడు నల్ల అద్దాలు ధరించి ఉండటాన్ని చూసిన‌ వధువు త‌ర‌పువారికి అనుమానం వచ్చింది. దీంతో వారు వ‌రుణ్ణి న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు తీసి, వార్తాపత్రిక చదవమని టెస్టు పెట్టారు. అయితే అత‌ను చదవలేకపోయాడు. దీంతో వ‌రునికి దృష్టిలోపం ఉంద‌ని తేలింది. ఈ విష‌యం తెలుసుకున్న వ‌ధువు అటువంటి వ‌రుడు త‌న‌కు స‌సేమీరా వ‌ద్ద‌ని తేల్చిచెప్పేసింది. త‌ద‌నంతరం వధువు తండ్రి వరుడి కుటుంబ సభ్యులు చేసిన మోసంపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

వివ‌రాల్లోకి వెళితే అచల్దా పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని మహారాజ్‌పూర్ గ్రామానికి చెందిన‌ వినోద్ కుమార్‌తో తన కుమార్తె వివాహం చేయాల‌ని నిశ్చ‌యిచిన‌ట్లు వ‌ధువు తండ్రి పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. కాగా వివాహ వేడుక‌లో భాగంగా న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు పెట్టుకున్న వ‌ధువు త‌ర‌పువారికి అత‌నిపై అనుమానం వ‌చ్చింది. ఈ విష‌యమైవారు వ‌రుని త‌ర‌పువారిని ప్ర‌శ్నించారు. వారు స‌రైన స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో నేరుగా వ‌రుని చేతికి ఒక వార్తాప‌త్రిక ఇచ్చి దానిని చ‌ద‌వ‌మ‌న్నారు. అత‌ను చ‌ద‌వ‌లేక‌పోయాడు. దీంతో వారంతా అత‌నిపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. రాత్రంతా ఇరువ‌ర్గాల మ‌ధ్య పంచాయితీ జ‌రిగింది. ఈ విష‌య‌మంతా తెలిసిన వ‌ధువు త‌న‌కు ఈ పెళ్లి వ‌ద్ద‌ని తెగేసి చెప్పింది. ఈ ఉదంతంపై వ‌ధువు తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

ప్రత్యేకంమరిన్ని...