పెళ్లయిన 20 రోజులకే సీన్ రివర్స్.. పడకగదిలో నిజాలే చెప్పుకోవాలన్న ఒప్పందం.. భార్య చెప్పిన విషయం విని భర్తకు మైండ్‌బ్లాంక్.. చివరకు..

ABN , First Publish Date - 2021-10-17T03:25:25+05:30 IST

కొత్తగా పెళ్లైన జంట. శోభనం గదిలో ఉన్నారు. వారి మధ్య మాటలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారు..ఒకరికొకరు ఎప్పుడూ నిజాలే చెప్పాలనుకున్నారు...తమ మధ్య రహస్యాలు ఉండకూడదనుకున్నారు. ఆ తరువాత.. ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

పెళ్లయిన 20 రోజులకే సీన్ రివర్స్.. పడకగదిలో నిజాలే చెప్పుకోవాలన్న ఒప్పందం.. భార్య చెప్పిన విషయం విని భర్తకు మైండ్‌బ్లాంక్.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా పెళ్లైన జంట. శోభనం గదిలో ఉన్నారు. వారి మధ్య మాటలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారు..ఒకరికొకరు ఎప్పుడూ నిజాలే చెప్పాలనుకున్నారు...తమ మధ్య రహస్యాలు ఉండకూడదనుకున్నారు. ముందుగా నువ్వు మొదలు పెట్టు.. అన్నాడు భర్త! సరేనని తన జీవితంలోని ముఖ్య విషయాలను చెప్పడం మొదలెట్టింది. ఈ క్రమంలో ఓ షాకింగ్ వాస్తవాన్ని ఆమె బయటపెట్టింది. దీంతో.. ఆమె భర్తకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ తరువాత.. పరిణామాలు వేగంగా మారిపోయాయి. కేవలం 20 రోజుల్లోనే వారి వైవాహిక బంధం ముగిసిపోయింది.  2019లో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది. 


తన సమీప బంధువే అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఆమె చెప్పడంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే గదిలోంచి బయటకు వచ్చి తల్లిదండ్రులను, అత్తమామలను పిలిచి పంచాయతీ పెట్టాడు. తన వద్ద నిజం ఎందుకు దాచారంటూ పెద్ద ఎత్తున రగడ చేశాడు. నవవధువు  ఏమో ఇదంతా చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె తల్లిదండ్రులు కూడా ఏమీ చెప్పలేక మౌనంగానే ఉండిపోయారు. యువకుడు మాత్రం తాను మోసపోయానంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. చివరికి భార్యకు విడాకులిచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. 


అయితే..కరోనా కారణంగా ఇంతకాలం విచారణ వాయిదా పడింది. కోర్టులు మళ్లీ ప్రారంభమయ్యాక యువకుడు కోర్టులో తన వాదన వినిపించాడు. నిజం దాచి తనను మోసం చేసిన కారణంగా తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు. అయితే.. ఈ కేసులో తమ వాదన వినిపించేందుకు భార్య తరపున ఎవరూ రాలేదు. చివరికి కోర్టు ఎక్స్‌పార్టీగానే విచారణ ముగించాల్సి వచ్చింది. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌లో పెట్టారు. మరోవైపు.. ఈ కేసుపై న్యాయవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇటువంటి కారణాల ఆధారంగా విడాకులు మంజూరు చేస్తే అత్యాచార బాధితులెవరూ నిజం చెప్పేందుకు ముందుకురారని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2021-10-17T03:25:25+05:30 IST