Viral Video:వామ్మో.. ఈ అమ్మాయేంటి ఇలా షాకిచ్చింది.. పెళ్లయ్యాక పుట్టింటి నుంచి భర్తతో కలిసి అత్తారింటికి వెళ్తూ..

ABN , First Publish Date - 2021-10-28T21:27:45+05:30 IST

ఓ యువతి.. తన మనసుకు నచ్చిన వాడిని కుటుంబ సభ్యులు, బంధు‌మిత్రులు, అథితుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి అత్తారింటికి బయల్దేరింది. ఈ సందర్భంగా ఆ నవ వధువు ప్రవర్తించిన తీరు.. అక్కడున్న వారిని షాక్‌కు గురించేసింది. ఆమె నోటి నుంచి వచ్చిన మాటలకు కుటుంబ సభ్యులు సహా అందరూ కంగుతిన్నారు. ఇందుకు సంబంధించి

Viral Video:వామ్మో.. ఈ అమ్మాయేంటి ఇలా షాకిచ్చింది.. పెళ్లయ్యాక పుట్టింటి నుంచి భర్తతో కలిసి అత్తారింటికి వెళ్తూ..

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువతి.. తన మనసుకు నచ్చిన వాడిని కుటుంబ సభ్యులు, బంధు‌మిత్రులు, అథితుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి అత్తారింటికి బయల్దేరింది. ఈ సందర్భంగా ఆ నవ వధువు ప్రవర్తించిన తీరు.. అక్కడున్న వారిని షాక్‌కు గురించేసింది. ఆమె నోటి నుంచి వచ్చిన మాటలకు కుటుంబ సభ్యులు సహా అందరూ కంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ కెమెరాల్లో బంధించి, సోషల్ మీడియాతో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ పెళ్లి కూతురికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఆ నవ వధువు ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే..



ఏషితా తుక్రాల్ అనే యువతికి పెళ్లి వయసు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు సంబంధాలను చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయి.. ఏషితాకు బాగా నచ్చాడు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు.. వారికి పెళ్లి నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నచ్చిన వాడితో ఏషితా వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి తంతు పూర్తైన తర్వాత సాధారణంగా అప్పగింతల కార్యక్రమం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే ఏషితా చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పగింతల నేపథ్యంలో భర్తతో కలిసి ఏషితా తన అత్తారింటికి వెళ్తున్న సందర్భంగా.. ఆమె కుటుంబ సభ్యులు అందరూ భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు. అయితే.. ఏషియా మాత్రం సంతోషంతో నవ్వింది. అంతేకాకుండా.. ‘నేను ఫొటోలు దిగాలి. ఏడిస్తే మేకప్ పాడవుతుంది. అందువల్ల ఇప్పుడు అస్సలు ఏడవను’ అంటూ వ్యాఖ్యానించింది. ఏషితా నోటి నుంచి ఆ మాటలు రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. కాగా.. ఆ దృశ్యాలన, ఏషితా మాటలను కొందరు తమ కెమెరాల్లో బంధించి, నెట్టింట పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో హల్‌చల్ చేస్తోంది. 






Updated Date - 2021-10-28T21:27:45+05:30 IST