ఇంట్లో టాయ్‌లెట్ లేకపోవడాన్ని అవమానంగా భావించిందా నవవధువు.. భర్తకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో..

ABN , First Publish Date - 2022-05-11T09:02:03+05:30 IST

వివాహం జరిగిన కొన్నిరోజులకే ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంట్లో టాయ్‌లెట్ (మరుగుదొడ్డి) లేకపోవడంతో తిరిగి తన పుట్టింటికే వచ్చేసింది. కానీ ఆమెను తిరిగి తీసుకెళ్లేందుకు వచ్చిన భర్తతో గొడవపడింది. ఇంట్లో టాయ్‌లెట్ లేకపోవడం తనకు అవమానం అని తన భర్తకు చెప్పి గొడవపడింది...

ఇంట్లో టాయ్‌లెట్ లేకపోవడాన్ని అవమానంగా భావించిందా నవవధువు.. భర్తకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో..

వివాహం జరిగిన కొన్నిరోజులకే ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంట్లో టాయ్‌లెట్ (మరుగుదొడ్డి) లేకపోవడంతో తిరిగి తన పుట్టింటికే వచ్చేసింది. కానీ ఆమెను తిరిగి తీసుకెళ్లేందుకు వచ్చిన భర్తతో  గొడవపడింది. ఇంట్లో టాయ్‌లెట్ లేకపోవడం తనకు అవమానం అని తన భర్తకు చెప్పి గొడవపడింది. ఆ తరువాత ఇంట్లోని తన గదిలో ఉరివేసుకుంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది.


కడలూరు జిల్లా అరిసిపెరియంకుప్పం గ్రామంలో నివసించే రమ్య(27) అనే యువతి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. గత ఏప్రిల్ 6న ఆమె కార్తికేయన్ అనే యువకుడితో వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన తరువాత రమ్య తన భర్త ఇంటికి వెళితే అక్కడ టాయ్‌లెట్ లేదు. ఈ విషయం చాలా సీరియస్ అని రమ్య తన భర్తతో చెప్పింది. కానీ కార్తికేయన్ ఆమె మాటలను పట్టించుకోలేదు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది.


కొన్ని రోజులకు రమ్య తీసుకెళ్లేందుకు ఆమె భర్త వచ్చాడు. కానీ టాయ్‌లెట్ ఉన్న ఇంట్లోనే తను ఉంటానని ఆమె చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ రోజు రాత్రి రమ్య తన గదిలో ఉరి వేసుకోగా.. అదే సమయంలో ఆమె తల్లి అక్కడకు చేరుకొని రమ్యను కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమ్య మరణించింది.


రమ్య ఆత్మహత్యకు ఆమె భర్త కారణమని పోలీసులకు రమ్య తల్లి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.


Read more